కోవిడ్ భయంతో విమానాశ్రయంలో మూడు నెలలు గడిపిన ఇండియన్-అమెరికన్, అరెస్టు చేసిన యూఎస్ పోలీసులు

కోవిడ్ 19 భయంతో అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలపాటు ఎవరికీ కనిపించకుండా విమానాశ్రయంలో గడిపేశాడంటే నమ్మలేం.

  • Umakanth Rao
  • Publish Date - 11:42 am, Tue, 19 January 21
కోవిడ్ భయంతో విమానాశ్రయంలో మూడు నెలలు గడిపిన ఇండియన్-అమెరికన్, అరెస్టు చేసిన యూఎస్ పోలీసులు

కోవిడ్ 19 భయంతో అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలపాటు ఎవరికీ కనిపించకుండా విమానాశ్రయంలో గడిపేశాడంటే నమ్మలేం.. కానీ నమ్మాల్సిందే. లాస్ ఏంజిల్స్ లో నివసించే  ఆదిత్య సింగ్ అనే ఇండో-అమెరికన్ విచిత్ర కథనమిది.. కరోనా వైరస్ భయంతో ఇతడు లాస్ ఏంజిల్స్ శివారులోని తన నివాసం నుంచి గత అక్టోబరులో షికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులోనే నిర్మానుష్యమైన చోట.. ఒక్కడూ దాక్కున్నట్టు మూడు నెలలు గడిపాడు. అత్యంత భద్రత, కట్టుదిట్టంగా ఉండే ఎయిర్ పోర్టులో ఈ వ్యక్తి ఎలా ఇన్ని నెలలు ఉన్నాడన్నది మిస్టరీగా ఉంది. ఈ నెల 16 న విమానాశ్రయ అధికారులు ప్రతి ప్రాంతాన్నీ గాలిస్తుండగా ఆదిత్య సింగ్ కనబడ్డాడు. ఇతని వివరాల గురించి ప్రశ్నించగా ఓ ఫేక్ బ్యాడ్జ్ చూపాడట. అది ఈ ఎయిర్ పోర్టు ఉద్యోగి ఒకరు  ఎప్పుడో పోగొట్టుకున్న బ్యాడ్జ్ అని తెలిసింది.  అక్టోబరు 19 నుంచి జనవరి 16 వరకు ఆదిత్య సింగ్ ఇలా ఇక్కడే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. కరోనా వైరస్ కు భయపడి తాను ఇక్కడకు చేరుకున్నానని తెలిపాడట. అనధికారిక ఎంట్రీ అంటూ వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టి ఇతడిని అరెస్టు చేశారు. హాస్పిటాలిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న ఆదిత్య సింగ్ కి క్రిమినల్ చరిత్ర ఏదీ లేదని, నిరుద్యోగి అని తెలిసింది.

Also Read:

KGF Yash: మాల్దీవుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతోన్న రాఖీ భాయ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు..

డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిరస్కరించిన జో బైడెన్ టీమ్, ఇక అంతా కొత్త ఉత్తర్వులే ! యూరప్, బ్రెజిల్ దేశాలకు నిరాశ

Ratha Saptami 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న టీటీడీ