డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిరస్కరించిన జో బైడెన్ టీమ్, ఇక అంతా కొత్త ఉత్తర్వులే ! యూరప్, బ్రెజిల్ దేశాలకు నిరాశ

యూరప్,బ్రెజిల్ దేశాల నుంచి అమెరికాలోకి ఆ దేశాల ప్రజలు ఎంటర్ కాకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన కొంతసేపటికే..

డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిరస్కరించిన జో బైడెన్ టీమ్, ఇక అంతా కొత్త ఉత్తర్వులే ! యూరప్, బ్రెజిల్ దేశాలకు నిరాశ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 11:20 AM

యూరప్,బ్రెజిల్ దేశాల నుంచి అమెరికాలోకి ఆ దేశాల ప్రజలు ఎంటర్ కాకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన కొంతసేపటికే నూతన అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఈ ఆదేశాలను నిలుపుదల చేశారు. మా మెడికల్ టీమ్ సలహామేరకు ఈ ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశం లేదని బైడెన్ టీమ్ లోని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. నిజానికి దేశంలో కోవిడ్ 19 వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ప్రజారోగ్య చర్యలను మరింత పటిష్ఠపరచవలసి ఉందని ఆమె చెప్పారు. కోవిడ్ పాండమిక్ పూర్తిగా అదుపులోకి రాలేదని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ వైరస్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని ఆమె అన్నారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ పై నిషేధాన్ని ఎలా ఎత్తివేస్తామన్నారు. ఆంక్షల ఎత్తివేతకు ఇది సమయం కాదన్నారు. యూరప్, బ్రెజిల్ దేశాలకు ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేస్తున్నామని, కానీ చైనా, ఇరాన్ నుంచి  ప్రజల ఎంట్రీని మాత్రం బ్యాన్ చేస్తున్నామని అంతకుముందు ట్రంప్ ప్రకటించారు. ఇక ఇలాగే ముందుముందు ట్రంప్ ఆదేశాలను బైడెన్ ప్రభుత్వం బుట్టదాఖలు చేయవచ్చు.

కాగా ట్రంప్ ఇక వైట్ హౌస్ ను వీడేందుకు సిధ్ధపడుతున్నారు. ఈ శ్వేత సౌధంలో ఇటీవలివరకు పని చేసిన పలువురు అధికారులు, సిబ్బంది రాజీనామాలు చేశారు.

Read More:

Ratha Saptami 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న టీటీడీ

Jackson Moonwalks At Work: 16 ఏళ్లుగా పాప్ రారాజు స్టెప్స్ వేస్తూ ట్రాఫిక్‌ని నియంత్రిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

అన్నదాతలు ఉగ్రవాదుల్లా కనబడుతున్నారా ? కేంద్రం, ఎన్ఐఎపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఆగ్రహం, రెచ్ఛగొడుతున్నారని వ్యాఖ్య