దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా యజ్ఞం.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు ఎంతమందికి అందిందంటే!
దేశ వ్యాప్తంగా కరోనా టీకా యజ్ఞం సాగుతోంది. కోట్ల మంది టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం...
Coronavirus Vaccination Drive: దేశంలో ఇవాళ వైరస్ పాజిటివిటీ రేటు 14.10 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 1.8 శాతం మందికి మాత్రమే వైరస్ సోకిందన్న ఆయన.. వైరస్ వ్యాప్తిని రెండు శాతం లోపు నియంత్రించినట్లు ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ ముఖ్య ప్రక్రియ అన్నారు.
ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకా యజ్ఞం సాగుతోంది. కోట్ల మంది టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. అంతే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ అందాలంటోంది టీవీ9.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 41 లక్షల 85 వేల 263 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 14 కోట్ల 33 లక్షల 99 వేల 138 మందికి మొదటి డోస్ తీసుకోగా.. 4 కోట్ల 7 లక్షల 86 వేల 125 మందికి రెండో డోసు కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 6 లక్షల 88 వేల 596 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇటు, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 77 లక్షల 57 వేల 605 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 8 వేల 279 మందికి మొదటి డోసు అందగా.. 22 లక్షల 49 వేల 326 మందికి రెండో డోసు కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 14 వేల 817 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డేస్ పూర్తైన వారు 44 లక్షల 50 వేల 647 మంది. కాగా, రెండో డోసు తీసుకున్న వారు 10 లక్షల 64 వేల 170 మంది. ఇదిలావుంటే, రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణలో రెండో డోస్ ప్రక్రియను కూడా నిలిపివేశారు. కేంద్రం నుంచి రావల్సిన వ్యాక్సిన్ రాకపోవడంతో.. రాష్ట్రంలో నాలుగు రోజులుగా నిలిచిపోయింది.
ఇక, దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి అనే వివరాలు చూస్తే.. 16 కోట్ల 50 లక్షల 15 వేల 386 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందగా.. కోటి 91 లక్షల 69 వేల 798 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి. ఇక, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 21 కోట్ల 86 లక్షల 4 వేల 892 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 7 కోట్ల 96 లక్షల 78 వేల 275 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 13 కోట్ల 89 లక్షల 26 వేల 617 మంది 45 ఏళ్ల పై బడినవారు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టండి….