AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. దేశంలో మరిన్ని దాడులకు కుట్రలు జరుగుతున్నాయన్న నిఘా వర్గాలు హెచ్చరికలతో దేశ వ్యప్తంగా భద్రతా దళాలు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్‌లో ఒక ప్రధాన ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి.

Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం!
Punjabterror Plot Foiled
Anand T
|

Updated on: May 06, 2025 | 2:18 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఉగ్రదాడిపై దర్యప్తును ముమ్మరం చేసిన ఎన్‌ఐఏ కీలక విషయాలను రాబట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి మాదిరి దేశంలో మరిన్ని దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రచేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు దేశ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పంజాబ్‌లో ఓ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో ఉగ్రకుట్రను భగ్నం చేశారు అధికారులు. జిల్లా శివారులోని అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆ ప్రాంతంలో నిఘా వర్గాల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించారు. వారి స్థావరాలపై దాడి చేసి ఉగ్రకుట్రను భగ్నం చేశారు.

ఇక వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఉగ్రవాదులు వినియోగిస్తున్న వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పంజాబ్ పోలీసులు ఈ ఉగ్రకుట్రను భగ్నం చేయగలిగాలరు.

కేంద్ర బలగాల సమన్వయంతో పంజాబ్ పోలీసులు ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసున్నారు. రెండు రాకెట్‌-ప్రొపెల్డ్ గ్రనేడ్‌లు, ఐదు పి-86 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రెండు ఇంప్రూవైజ్జ్ పేలుడు పరికరాలు, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సెట్‌, కొంత మేర మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ