AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mock Drill Reharsals: దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌.. మాక్‌ డ్రిల్స్‌ సమయంలో కావాల్సిన పరికరాలు ఏవంటే..

Mock Drill Reharsals: హోం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల సైరన్లు, బ్లాక్అవుట్ పరిస్థితులకు ఎలా స్పందించాలో దృష్టి సారించనున్నారు. అదనపు సామాగ్రి, టార్చెస్, కొవ్వొత్తులతో కూడిన మెడికల్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలని పౌరులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వైఫల్యాల వల్ల తలెత్తే పరిస్థితులను..

Mock Drill Reharsals: దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌.. మాక్‌ డ్రిల్స్‌ సమయంలో కావాల్సిన పరికరాలు ఏవంటే..
Subhash Goud
| Edited By: |

Updated on: May 06, 2025 | 1:42 PM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య వివిధ అత్యవసర పరిస్థితులకు సంసిద్ధతపై దృష్టి సారించి బుధవారం మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

హోం మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్షా సమావేశంలో 244 జిల్లాల పౌర రక్షణ సంస్థాపనల పరిస్థితిని అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే ఉన్న పరికరాల పనితీరు, మరమ్మతుల అవసరం కూడా ఉంది. పౌరులకు శిక్షణ ఈ కసరత్తులలో కీలకమైన అంశంగా ఉంటుంది.

హోం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల సైరన్లు, బ్లాక్అవుట్ పరిస్థితులకు ఎలా స్పందించాలో దృష్టి సారించనున్నారు. అదనపు సామాగ్రి, టార్చెస్, కొవ్వొత్తులతో కూడిన మెడికల్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలని పౌరులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వైఫల్యాల వల్ల తలెత్తే పరిస్థితులను నిర్వహించడానికి ప్రజలు నగదును అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌ మోగబోతోంది. రేపు దేశవ్యాప్తంగా సివిల్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది రిహార్సిల్స్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి.. గాయపడిన వారిని ఎలా తరలించాలి? ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేవి ఈ రిహార్సిల్స్‌లో చేపట్టారు. 1971 పాక్‌ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత భారత్‌-పాక్‌ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో రేపు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు. బెంగాల్‌లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్‌లో ఐదు చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్‌లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?