ఇండియా ఔదార్యం, ఉగాండాకు బహుమతిగా 36 వాహనాలు

భార‌త్..స‌ఖ్య‌త ఉన్న దేశాల‌తో మైత్రిని మ‌రింత బ‌ల‌ప‌రుచుకుంటుంది. ఈ క్ర‌మంలో అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఆయా దేశాల‌ను స్నేహ హ‌స్తం అందిస్తోంది.

ఇండియా ఔదార్యం, ఉగాండాకు బహుమతిగా 36 వాహనాలు
Follow us

|

Updated on: Aug 27, 2020 | 3:41 PM

భార‌త్..స‌ఖ్య‌త ఉన్న దేశాల‌తో మైత్రిని మ‌రింత బ‌ల‌ప‌రుచుకుంటుంది. ఈ క్ర‌మంలో అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఆయా దేశాల‌ను స్నేహ హ‌స్తం అందిస్తోంది. తాజాగా ఉగాండాకు 36 వాహ‌నాల‌ను ఇండియా గిఫ్ట్‌గా ఇచ్చింది. వీటిలో 10 సైనికుల త‌ర‌లింపు వాహ‌నాలు, ప‌ది బ‌స్సులు, 14 మోటార్ బైక్‌లు, రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇటీవ‌ల కంపాలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో భార‌త రాయ‌బారి అజ‌య్ కుమార్, ఆ కంట్రీ డిఫెన్స్ మినిస్ట‌ర్ మ్వేసిగేకి వాటిని అంద‌జేశారు. ఈ క్ర‌మంలో భార‌త్ సాయానికి ఉగాండా ధ‌న్యవాదాలు తెలిపింది.

2018 జూలైలో భార‌త ప్రధాని మోదీ ఉగాండాలో పర్యటించారు. ఆ స‌మ‌యంలో ఆ దేశ పౌరులు, సైనికుల అవసరాల కోసం వాహనాలను గిఫ్ట్‌గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని తాజాగా ఇండియా నెరవేర్చింది. ఉగాండాకు 36 వాహనాలను ఫ్రీగా అందజేసింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఉగాండా రక్షణ శాఖ మంత్రి అడాల్ఫ్ మ్వేసిగేకి భారత్ గొప్ప‌త‌నాన్ని కొనియాడారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య స్నేహ‌ సంబంధాలను పెంపొందిస్తాయ‌ని పేర్కొన్నారు.

Also Read :

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము