India- China Disengagement: చురుకుగా ఉపసంహరణలు, తోక ముడుస్తున్న చైనా, పాంగాంగ్ సో వద్ద జెట్టీ, హెలిపాడ్ ధ్వంసం
భారత, చైనా దేశాలమధ్య ఉద్రిక్తతలు క్రమంగా సడలుతున్నాయి. లదాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన ఉపసంహరణలను కొనసాగిస్తోంది. పాంగాంగ్ సో ఉత్తర ప్రాంతంలో
India- China Disengagement: భారత, చైనా దేశాలమధ్య ఉద్రిక్తతలు క్రమంగా సడలుతున్నాయి. లదాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన ఉపసంహరణలను కొనసాగిస్తోంది. పాంగాంగ్ సో ఉత్తర ప్రాంతంలో ఫింగర్ పాయింట్-5 వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన జెట్టీని, హెలిపాడ్ ని ధ్వంసం చేసింది. గత ఏడాది ఏప్రిల్ లో తాను ఆక్రమించిన ఫింగర్-4 పాయింట్ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేస్తోందని, షెల్టర్లను నాశనం చేస్తోందని తెలుస్తోంది. అలాగే డ్రాగన్ కంట్రీ తన యుధ్ధ ట్యాంక్లను కూడా వెనక్కి తీసుకున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ నెల 10 నుంచి పలు ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి ఉపసంహరణ ప్రక్రియను చైనా ప్రారంభించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఇదే సమయంలో భారత దళాలు కూడా తిరిగి తమ యధాస్థానాలకు మళ్ళుతున్నాయన్నారు.
ఫింగర్-5 వద్ద చైనా నిర్మించిన జెట్టీ అతి పెద్ద నిర్మాణాల్లో ఒకటని సమాచారం. పాంగాంగ్ సరస్సులోని బోట్లలో తమ సైనిక దళాలు దిగడానికి వీలుగా దీన్ని నిర్మించారు. నిజానికి ఫింగర్-4 పాయింట్ వద్ద నుంచి చూస్తే భారత బోట్లను నిలిపే లుకుంగ్ ప్రాంతం చైనా దళాలకు కనిపిస్తుందని చెబుతారు. తద్వారా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ముందుగానే భారత దళాల కదలికలు అవగతమవుతాయి. ఇక్కడ సుమారు 200 వరకు చైనా తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. భారత, చైనా మధ్య కమాండర్ల స్థాయిలో పలు దఫాలుగా సాగిన చర్చలు సత్పలితాలనిచ్చాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.
Read More: