మధ్యప్రదేశ్ సీఎం‌కు షాక్.. సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

ఇండోర్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్య ప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల నుండి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే ఢిల్లీలో ఉండే సీఎం అడ్వైజర్‌ రాజేంద్ర కుమార్‌ ఇంట్లో కూడా […]

మధ్యప్రదేశ్ సీఎం‌కు షాక్.. సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 07, 2019 | 11:43 AM

ఇండోర్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్య ప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల నుండి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే ఢిల్లీలో ఉండే సీఎం అడ్వైజర్‌ రాజేంద్ర కుమార్‌ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.9కోట్లు నగదు లభించినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు అధికారులు …తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు హవాలా రూపంలో నగదును తరలిస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు ఇంకా పలుచోట్ల సోదాలు చేపడుతున్నారు.