అమెరికాలో తెలుగమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి

అమెరికాలో తెలుగమ్మాయి సంధ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతి చెందిన ఘటన మరువకముందే సంధ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. ఆమె భర్త శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత […]

అమెరికాలో తెలుగమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 07, 2019 | 1:45 PM

అమెరికాలో తెలుగమ్మాయి సంధ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతి చెందిన ఘటన మరువకముందే సంధ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. ఆమె భర్త శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత శ్రీకాంత్ అదనపు కట్నం కోసం సంధ్యను వేధిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, సంధ్య గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీకాంత్ ఇండియాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో సంధ్య తండ్రి మహేందర్ తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహేందర్‌కు ముగ్గురు కుమార్తెలు కాగా, వారిలో సంధ్య చిన్న కుమార్తె. సమీప బంధువు అయిన శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు.