ఆర్టికల్ 370 రద్దును ఒప్పుకోం : పాకిస్థాన్
ఇస్లామాబాద్ : జమ్ముకశ్మీరుకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ అలా చేస్తే, అది ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉల్లంఘించినట్లేనంటూ వ్యాఖ్యానించింది. పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ శుక్రవారం ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంట్ చట్టాలు చేయకుండా ఈ ఆర్టికల్ 370 అడ్డుకట్ట వేస్తున్నది. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఈ ఆర్టికల్ […]
ఇస్లామాబాద్ : జమ్ముకశ్మీరుకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ అలా చేస్తే, అది ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉల్లంఘించినట్లేనంటూ వ్యాఖ్యానించింది. పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ శుక్రవారం ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంట్ చట్టాలు చేయకుండా ఈ ఆర్టికల్ 370 అడ్డుకట్ట వేస్తున్నది. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఈ ఆర్టికల్ 370ని రద్దు చేస్తారన్న చర్చ నడుస్తున్నది. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించే ఈ ఆర్టికల్ రద్దుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించం. కశ్మీరీలు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైసల్ అన్నారు. అసలు ఈ ఆర్టికల్‌ను రద్దు చేయాలని తాము చూస్తున్నామని, అయితే రాజ్యసభలో తగిన మెజార్టీ లేకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నట్లు వార్తలు వచ్చాయి. అమిత్ షా వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్‌లోని పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.