రాహుల్ సభలో ‘పకోడా’ కేక ! మోదీకే ఇవ్వమన్న నేత !

బీహార్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఈ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి హాజరైనవారిలో ఎవరో వ్యక్తి.. హేళనగా ‘మీరు పకోడా వేయిస్తారట కదా’ ? అని అరిచాడు. అయితే రాహుల్ ఏ మాత్రం చలించకుండా..’మీరు పకోడాలు వేయిస్తారా ? అయితే  ఈ సారి మీరు వాటిని నితీష్ కి, మోదీకి ఇవ్వండి’ అని చమత్కరించారు. (కౌంటర్  వేశారు). ఈ వ్యాఖ్యకు ప్రజలు, […]

  • Umakanth Rao
  • Publish Date - 4:58 pm, Wed, 28 October 20
రాహుల్ సభలో 'పకోడా' కేక ! మోదీకే ఇవ్వమన్న నేత !

బీహార్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఈ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి హాజరైనవారిలో ఎవరో వ్యక్తి.. హేళనగా ‘మీరు పకోడా వేయిస్తారట కదా’ ? అని అరిచాడు. అయితే రాహుల్ ఏ మాత్రం చలించకుండా..’మీరు పకోడాలు వేయిస్తారా ? అయితే  ఈ సారి మీరు వాటిని నితీష్ కి, మోదీకి ఇవ్వండి’ అని చమత్కరించారు. (కౌంటర్  వేశారు). ఈ వ్యాఖ్యకు ప్రజలు, ఓటర్లు అంతా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. కేక పెట్టిన వ్యక్తి కూడా నవ్వేశాడు.  ఇక రాహుల్ యధాప్రకారం తన స్పీచ్ లో .. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.’ దేశంలోని రెండు కోట్లమంది యువతకు ఉద్యోగాలు ఇవ్వలేమని మోదీకి తెలుసునని, కానీ ఇస్తామని అబద్ధాలు ఆడుతారని ఆయన అన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి.. మీకు 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెబితే గుంపు ఆయనను తరిమేస్తారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అసత్యాలు చెప్పడంలో తాము మోదీతో పోటీ పడలేమని, ఇది తమ పెద్ద పొరబాటని రాహుల్ సెటైర్ వేశారు.

ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి.