ఇదిగో కోడిగుడ్డు… సుత్తితో కొట్టు
ప్రపచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్. అక్కడ ఇండియన్ ఆర్మీ నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది. అయితే.. ఆ మంచు పర్వతాల్లో శత్రువులతో కంటే.. మంచుతోనే పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాగే నీటితో పాటూ.. ఏది తినాలన్నా గడ్డకట్టే ఉంటాయి. ఎంత దారుణమంటే.. సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా అయిపోతాయి. సియాచిన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ జవాన్లు ఓ వీడియో తీశారు. ఇక్కడ జీవించడం ఎంత కష్టమో ఈ కింది […]
ప్రపచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్. అక్కడ ఇండియన్ ఆర్మీ నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది. అయితే.. ఆ మంచు పర్వతాల్లో శత్రువులతో కంటే.. మంచుతోనే పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాగే నీటితో పాటూ.. ఏది తినాలన్నా గడ్డకట్టే ఉంటాయి. ఎంత దారుణమంటే.. సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా అయిపోతాయి.
సియాచిన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ జవాన్లు ఓ వీడియో తీశారు. ఇక్కడ జీవించడం ఎంత కష్టమో ఈ కింది వీడియో చూస్తే అర్థమౌతుంది. జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టి ఉంది. దాన్ని తాగాలంటే వేడి చేయాల్సిందే. అలాగే దుంపలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా మారిపోయాయని సైనికులు వివరించారు. కొడిగుడ్లు కూడా తినాలంటే సుత్తితో పగలగొట్టినా.. ఒక్కోసారి పగలకుండా ఉంటాయని సైనికులు వెల్లడించారు.
https://www.facebook.com/IMA.Dehradun.Uk/videos/364614397587955/