ఐటి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌, జేడీఎస్‌ ధర్నా

ఐటి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌, జేడీఎస్‌ ధర్నా

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్‌ నేత, మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రి సిఎస్‌ పుట్టరాజు నివాసంపై ఐటి దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ కార్యకర్తలు బెంగళూరులోని ఐటి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ సన్నిహితులు, మంత్రి పుట్టరాజు నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీల నేతలపై దాడులు చేయిస్తూ భయాందోళనలకు గురి చేస్తోందని పలువురు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 28, 2019 | 5:40 PM

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్‌ నేత, మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రి సిఎస్‌ పుట్టరాజు నివాసంపై ఐటి దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ కార్యకర్తలు బెంగళూరులోని ఐటి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ సన్నిహితులు, మంత్రి పుట్టరాజు నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీల నేతలపై దాడులు చేయిస్తూ భయాందోళనలకు గురి చేస్తోందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా ఉదయం కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు నివాసంతో పాటుగా.. స్వగ్రామం చినకురులిలో తెల్లవారుజామున 5.00గంటల నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మాండ్యాలో పుట్టరాజుకు సంబంధించిన ఆస్తులపైనా, మైసూరులో ఆయన బంధువు ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి. తన నివాసాలతో పాటుగా తన బంధువుల ఇళ్ళపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఎన్నికల ముందు కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతుందని.. తన ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని మంత్రి అన్నారు. మరోవైపు జేడీఎస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యాపార‌వేత్త‌లు, నేత‌ల‌పై కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులపై ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. ఈ దాడులు ప్రధాని కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని ఆరోపించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu