సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీహార్‌లో నక్సల్స్‌ ఘాతుకం

బీహార్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌లో నక్సల్స్‌ ఘాతుకానికి పాల్పడ్డారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ నేత ఇంటిని డైనమెట్లతో పేల్చేశారు మావోయిస్టులు. దుమారియా ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ అనే పార్టీ నేత ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిని పేల్చివేసేముందు ఇంట్లోని వారందరినీ బయటకు పంపేయడంతో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. వెళ్లిపోయే […]

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీహార్‌లో నక్సల్స్‌ ఘాతుకం
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2019 | 8:19 PM

బీహార్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌లో నక్సల్స్‌ ఘాతుకానికి పాల్పడ్డారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ నేత ఇంటిని డైనమెట్లతో పేల్చేశారు మావోయిస్టులు. దుమారియా ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ అనే పార్టీ నేత ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిని పేల్చివేసేముందు ఇంట్లోని వారందరినీ బయటకు పంపేయడంతో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. వెళ్లిపోయే ముందు నక్సలైట్లు అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలను ప్రతి ఒక్కరూ బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు వెళ్లిపోయిన తరువాత ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, గయ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా ప్రాంతంలో నక్సల్స్‌ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిని ఎదుర్కోవడం భద్రతా బలగాలకు సవాలుగా మారింది. కాగా ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రాంతంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు.