CORONA: కరోనా చైన్‌ను బ్రేక్ చేస్తే జరిగే మేలు ఇదే.. హైదరాబాద్ పోలీసులు ఎంత చక్కగా వివరించారో చూడండి..
Hyderabad Police: ప్రస్తుతం ఎక్కడ విన్నా, చూసినా కరోనాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రోజు ప్రారంభమైంది మొదలు రాత్రి పడుకునే వరకు కరోనాకు సంబంధించన వార్తలే వస్తున్నాయి. ప్రజలు నిజంగానే...

Hyderabad Police: ప్రస్తుతం ఎక్కడ విన్నా, చూసినా కరోనాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రోజు ప్రారంభమైంది మొదలు రాత్రి పడుకునే వరకు కరోనాకు సంబంధించన వార్తలే వస్తున్నాయి. ప్రజలు నిజంగానే కరోనాతో సావాసం చేసే రోజులు వచ్చాయి. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఎంతటి భయంకరమైన వైరస్ అయినా సరే.. సరైన పద్ధతులు పాటిస్తే దాని పని పట్టొచ్చని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరి ఒక చైన్‌లాగా వ్యాపించే ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా ఆ చైన్‌ను బ్రేక్ చేయాల్సిందే. మొదటి వేవ్ నుంచి నిపుణులు చెబుతోంది ఇదే. అందులో భాగంగానే ఈ లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు. అయితే ఇప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమకు సోకిన వైరస్‌ను ఇతరులకు అంటిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు చైన్ బ్రేక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనేగా.. ఒక మంచు పర్వతం ప్రాంతంలో వరుసలో వందల సంఖ్యలో పెంగ్విన్‌లు నడుచుకుంటూ వెళుతున్నాయి. అందులో ఓ పెంగ్విన్ వెనక్కి వాలి పడిపోతుంది. దీంతో దాని వెనకాల ఉన్న పెంగ్విన్‌లన్నీ వరుస పెట్టి పడిపోతూనే ఉంటాయి. అయితే మధ్యలో ఉన్న ఓ పెంగ్విన్ తెలివిగా ఆలోచించి పక్కకు తప్పుకుంటుంది. దీంతో వెనక ఉన్న పెంగ్విన్‌లన్నీ తప్పించుకుంటాయి. అచ్చంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే కూడా కరోనా సోకిన వ్యక్తి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఎవరినీ కలసుకోకూడదు, కనీసం 15 రోజులు ఇలా ఉంటే సదరు వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా సోకదు. ఇలా కరోనా సోకిన వారంతా తమకు తాము.. నిర్బంధంలో ఉంటే కరోనా వ్యాప్తి త్వరలోనే ఆగిపోతుంది. హైదరాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
పోలీసులు చేసిన ట్వీట్..
#BreakTheChain pic.twitter.com/wxZxPDh4rQ
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 18, 2021
Sonu Sood: సోనూసూద్‌పై కలెక్టర్ విమర్శలు.. అంతలోనే ప్రశంసలు.. అసలు ఏం జరిగిందంటే