AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సోనూసూద్​పై కలెక్టర్​ విమర్శలు.. అంత‌లోనే ప్రశంసలు.. అసలు ఏం జ‌రిగిందంటే

క‌రోనా ఫ‌స్ట్ వేవ్, సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆస‌రాగా ఉండి దేశవ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు న‌టుడు సోనూ సూద్. రియ‌ల్ అని పేరు తెచ్చుకున్నాడు.

Sonu Sood: సోనూసూద్​పై కలెక్టర్​ విమర్శలు.. అంత‌లోనే ప్రశంసలు.. అసలు ఏం జ‌రిగిందంటే
Sonusood
Ram Naramaneni
|

Updated on: May 18, 2021 | 3:37 PM

Share

క‌రోనా ఫ‌స్ట్ వేవ్, సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆస‌రాగా ఉండి దేశవ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు న‌టుడు సోనూ సూద్. రియ‌ల్ అని పేరు తెచ్చుకున్నాడు. కొంద‌రు అయితే దేవుడు అని సంభోదిస్తున్నారు. కాగా తాజాగా సోనూసూద్​ను ఒడిశాలోని గంజామ్​ జిల్లా కలెక్ట‌ర్ విమ‌ర్మించారు. మ‌రికాసేప‌టికే ఆయ‌న్ను ప్ర‌శంశిస్తూ ట్వీట్ చేశారు. వివ‌రాలు తెలుసుకుందాం ప‌దండి. గంజాం జిల్లాకు చెందిన ఓ క‌రోనా బాధితురాలు తనకు చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయమని కోరుతూ సోనూసూద్​ను ఆశ్ర‌యించింది. దీనిపై స్పందించిన సోనూసూద్​.. గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్​ను ఏర్పాటు చేసినట్లు ఈనెల 15న ట్విట్టర్​లో తెలిపారు.

దీనిపై గంజాం కలెక్ట‌ర్ వేసిన ట్వీట్

“సోనూసూద్​ కానీ, ఆయన సంస్థ కానీ మమ్మల్ని సంప్రదించలేదు. బాధితురాలు ప్రస్తుతం హోంఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతోంది. పడకలకు ఎలాంటి కొరత లేదు. బరంపుర్ కార్పొరేషన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు​ పర్యవేక్షిస్తున్నారు”అని క‌లెక్ట‌ర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కలెక్ట‌ర్ ట్వీట్ కు సోనూ స్పంద‌న

“మేము మిమ్మల్ని సంప్రదించినట్లు ఎక్కడా చెప్పలేదు. బాధితురాలు మమల్ని సంప్రదించినందుకు మేము తగిన ఏర్పాట్లు చేశాము. నేను అటాచ్​ చేసిన ఛాట్స్​ అందుకు సంబంధించిన ఆధారాలు. బాధితురాలికి సంబంధించిన కాన్టాక్ట్​ వివరాలు మీకు మెసేజ్​ చేశాను.” అని సోనూ రిప్లై ఇచ్చారు.

మ‌ళ్లీ క‌లెక్ట‌ర్ ప్ర‌శంస‌లు…

‘మీరు చేస్తున్న పనిని విమర్శించాలి అనేది మా అభిమ‌తం కాదు. బెడ్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మా టీమ్ 24 గంటలు కృషి చేస్తోంది. కానీ ఇంకా పడక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేయడం మా బాధ్యత. మీరు, మీ సంస్థ గొప్ప సేవ చేస్తున్నారు’ అని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Also Read: క‌రోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత వ్యాక్సిన్.. !

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు

Follow Us
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ