తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు

క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా ప‌నిచేస్తున్న‌....

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు
Doctors
Follow us

|

Updated on: May 18, 2021 | 3:39 PM

క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా ప‌నిచేస్తున్న‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలోని జూనియర్ రెసిడెంట్ వైద్యులు తమ జీతాలను 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగ‌బోతున్న‌ట్లు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో అలెర్టైన తెలంగాణ స‌ర్కార్ జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు (హౌస్ సర్జన్లు, పీజీ), ఇంట‌ర్న్ షిప్ చేస్తున్న‌వాళ్ల‌కి 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

స్టయిఫండ్​లు ఇలా…

మెడికల్, డెంటల్ హౌస్​సర్జన్లకు ఇక నుంచి నెలకు రూ.22,527 వస్తుంది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ మొదటి సంవత్సరం వారికి నెలకు రూ.50,686 స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ రెండో ఏడాది వారికి రూ. 53,503… పీజీ డిగ్రీ, ఎండీఎస్ మూడో ఏడాది వారికి రూ.56,319 ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ. 56319, రెండో ఏడాది వారికి రూ.59135, మూడో సంవత్సరం వారికి రూ.61949 రూపాయలు స్టయిఫండ్ రానుంది.

……………………………..

హౌస్ స‌ర్జ‌న్ మెడిక‌ల్ కు గతంలో 19589 రూపాయ‌లు స్టైఫండ్ వ‌స్తుండ‌గా.. తాజా ఉత్వ‌ర్వుల‌తో వారికి 22527 రూపాయ‌ల స్టైఫండ్ రానుంది

హౌస్ స‌ర్జ‌న్ డెంట‌ల్ కు గ‌తంలో 19589 రూపాయలు స్టైఫండ్ వ‌స్తుండ‌గా.. తాజా ఉత్వ‌ర్వుల‌తో వారికి 22527 రూపాయ‌ల స్టైఫండ్ రానుంది

పీజీ డిగ్రీ                     గ‌తంలో    ఇప్పుడు ఫ‌స్ట్ ఇయ‌ర్                 44075      50686 సెకండ్ ఇయ‌ర్            46524     53503 ఫైన‌ల్ ఇయ‌ర్             48973      56319

పీజీ డిప్ల‌మో                  గ‌తంలో    ఇప్పుడు ఫ‌స్ట్ ఇయ‌ర్                   44075     50686 సెకండ్ ఇయ‌ర్             46524    53503

సూప‌ర్ స్పెషాల‌టీ          గ‌తంలో    ఇప్పుడు ఫ‌స్ట్ ఇయ‌ర్                   48973      56319 సెకండ్ ఇయ‌ర్              51422      5 9135 థ‌ర్డ్ ఇయ‌ర్                   53869      61949

ఎమ్.డి.ఎస్                 గ‌తంలో    ఇప్పుడు ఫ‌స్ట్ ఇయ‌ర్                 44075       50686 సెకండ్ ఇయ‌ర్            46524       53503 థ‌ర్డ్ ఇయ‌ర్                 48973        56319

Also Read:  క‌రోనా నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌.. ద‌రఖాస్తులకు గ‌డువు..

 సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…