TSPSC Recruitment 2021: కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్.. దరఖాస్తులకు గడువు..
TSPSC Recruitment 2021: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతుండడం, దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు బోర్డుల పరీక్షలను...
TSPSC Recruitment 2021: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతుండడం, దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు బోర్డుల పరీక్షలను రద్దు చేశాయి కూడా. ఇక పోటీ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక మరికొన్ని పరీక్షల దరఖాస్తు తేదీలను పొడగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తుల తేదీని పొడగిస్తూ ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పీవీ నర్సింహా రావు వెటర్నీరీ, జయ శంకర్ అగ్రీకల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి ఈ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీగా ఈ నెల 20ని నిర్ణయించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అప్లికేషన్లకు చివరి తేదీగా ఈ నెల 31ని నిర్ణయించారు. ఇక ప్రభుత్వం ఈ పోస్టులను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పోస్టు భర్తీ చేస్తోన్నవిషయం విధితమే.
భర్తీ చేయనున్న పోస్టులు..
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. * వీటిలో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 112 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. * పూర్తి వివరాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించండి
Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..
నిరుద్యోగులకు సువర్ణావకాశం.. 3479 టీచర్ పోస్టులు.. మే31 చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..?