Telangana High Court: సీటీ స్కాన్‌, రక్త‌ప‌రీక్ష‌ల‌పై స‌ర్కారుకు హైకోర్టు ఆదేశం.. ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని..

Telangana High Court On CT Scan: క‌రోనా నేప‌థ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వ‌హిస్తోన్న సీటీ స్కాన్‌, ర‌క్త ప‌రీక్ష‌ల ధ‌రల వివ‌రాల‌ను తెల‌పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో 48 గంట‌ల్లో..

Telangana High Court: సీటీ స్కాన్‌, రక్త‌ప‌రీక్ష‌ల‌పై స‌ర్కారుకు హైకోర్టు ఆదేశం.. ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని..
Ts High Court On Ct Scan Rates
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2021 | 2:28 PM

Telangana High Court On CT Scan: క‌రోనా నేప‌థ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వ‌హిస్తోన్న సీటీ స్కాన్‌, ర‌క్త ప‌రీక్ష‌ల ధ‌రల వివ‌రాల‌ను తెల‌పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో 48 గంట‌ల్లో పూర్తి వివ‌రాలు అందించాల‌ని గ‌డువు విధించింది. ఇక సీటీ స్కాన్, ఇత‌ర ప‌రీక్ష‌ల‌కు గ‌రిష్ట ధ‌ర‌ను నిర్ణ‌యించ‌కుండా.. వీటిని మిన‌హాయిస్తూ గ‌త ఏడాది జీవో ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. క‌రోనా స‌మ‌యంలో కీల‌కంగా మారిన సీటీ స్కాన్‌, ఇత‌ర ర‌క్త ప‌రీక్ష‌ల ధ‌ర‌ల‌తో పాటు పీపీఈ కిట్స్‌కు, వైద్య చికిత్సలకు ధరలను నిర్ణయించి తాజాగా జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స‌ద‌రు జీవోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల‌ని పేర్కొంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌రలు.. రోగులు, వారి స‌హాయ‌కుల‌కు తెలిసేలా అన్ని ఆసుప‌త్రుల నోటీసు బోర్డుల్లో ఉంచాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఈ ధ‌ర‌ల‌ను తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో చర్చించి నిర్ణయించాలని సూచించింది. ప్రై వేటు ఆసుపత్రుల చికిత్సలు, ఫీజుల దోపిడీపై ఫిర్యాదు చేసేందుకు వెంటనే వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీక‌ర‌ణ కోసం ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌పై వాస్తవ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

గ‌ర్భిణుల‌కు క‌రోనా నిర్ధార‌ణ లేకుండా జాయిన్ చేసుకోవాలి..

క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. గర్భిణులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్‌సహా ఇతర చికిత్సల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ గర్భిణి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోలేదన్న కారణంగా పలు ఆసుపత్రులకు తిరిగినా అడ్మిషన్‌ఇవ్వకపోవడంతో మృత్యువాతపడిన విషయాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తాము అప్పట్లోనే ఆదేశించినా, గర్భిణులు ఇప్పటికీ చికిత్స అందక మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష రిపోర్టు అడగకుండా గర్భిణులకు అడ్మిషన్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

రోగిని ప‌రీక్షించ‌కుండా స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారు..?

కరోనా చికిత్సలో భాగంగా స్వల్ప లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న మందుల కిట్‌లో స్టెరాయిడ్స్‌ కూడా ఉంటున్నాయని, రోగిని పరీక్షించకుండా స్టెరాయిడ్స్‌ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టెరాయిడ్స్‌ వాడడం ద్వారా దుష్పలితాలు ఉంటాయని, బ్లాక్‌ ఫంగస్‌ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొంది.

క‌రోనా ప‌రీక్ష‌ల విష‌యంలో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన కోర్టు..

రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని, పరీక్షల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని, ఇటీవల 65 వేలకు మించి పరీక్షలు చేయడం లేదంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. ఇక క‌రోనా థార్డ్ వేవ్ పొంచి ఉన్ననేప‌థ్యంలో క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెల‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అంతేకాకుండా 45 ఏళ్లు దాటిన వారితోపాటు 18–45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల‌ని తెలిపింది. ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే ఎలా ? వెంటనే వారికి జీతాలు చెల్లించాల‌ని ఆదేశించింది.

Also Read: AC and Refrigerators: బాగా పడిపోయిన ఏసీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు.. వరుసగా రెండో ఏడాదీ సీజన్ పోయినట్టే అంటున్న కంపెనీలు!

పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ పై గుంపుల దాడి, ‘ఆ వ్యక్తిని’ తమకు అప్పగించాలంటూ గంటకు పైగా బీభత్సం, పరుగులు తీసిన పోలీసులు

Gangula : ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన మంత్రి గంగుల.. ఆరోపణలు రుజువు చేస్తే ఐదు రెట్లు పరిహారం చెల్లిస్తానని సవాల్

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!