పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ పై గుంపుల దాడి, ‘ఆ వ్యక్తిని’ తమకు అప్పగించాలంటూ గంటకు పైగా బీభత్సం, పరుగులు తీసిన పోలీసులు
పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై వందల సంఖ్యలో ప్రజలు దాడి చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ వారు కర్రలు, ఇనుప రాడ్లతో దూసుకు వచ్చారు.
పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై వందల సంఖ్యలో ప్రజలు దాడి చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ వారు కర్రలు, ఇనుప రాడ్లతో దూసుకు వచ్చారు. ఇస్లామాబాద్ లోని .గోర్లా పోలీసుల కస్టడీలో ఉన్న ఆ వ్యక్తి కోసం స్టేషన్ లో అన్ని చోట్లా వెదికారు. ఆ వ్యక్తి కనబడకపోయేసరికి పోలీసులపైనే తిరగబడ్డారు. స్టేషన్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఆ గుంపు నుంచి తమను తాము రక్షించుకోవడానికి పోలీసులు భయంతో పరుగులు పెట్టారు. వీరిని అక్కడి నుంచి చెదర గొట్టేందుకు కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ రయట్ యూనిట్ల నుంచి వందల సంఖ్యలో పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. సుమారు గంట తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా ఇంతా చేస్తే దైవ దూషణకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అప్పటికే అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. ఇలా దైవ దూషణకు దిగినవారికి పాకిస్థాన్ లో తీవ్రమైన శిక్షలు విధిస్తారు. ఇందుకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఈ చట్టాలను సవరించి కొంత మానవత్వం చూపాలని అంతర్జాతీయ దేశాలు చేస్తున్న అభ్యర్థనను పాకిస్థాన్ పెడచెవిన పెడుతోంది. మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్న 29 మందికి 2019 లో మరణ శిక్షలు విధించారు. ఇంకా 80 మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Defence Services Staff College: డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Viral Video: సూపర్ బామ్మ.. ! బౌలింగ్‌తో అదరగొట్టేసింది.. ! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే