Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyberabad Police: మీరు జాగ్రత్తలు పాటించండి.. అందరినీ జాగ్రత్తగా ఉండేలా చేయండి..ఆకట్టుకుంటున్న సైబరాబాద్ పోలీసుల వీడియో!

Cyberabad Police: కరోనా మహమ్మారి ఎక్కడా వదలను అంటోంది. అవకాశం దొరికితే ఇంకా నా వేషాలు మార్చుకుని మరింత బలంగా వస్తాను అని సవాల్ చేస్తోంది. ఇక్కడా.. అక్కడా అని కాకుండా అన్ని చోట్లా పట్టుకుని వేలాడుతూ ఉంటోంది కరోనా వైరస్.

Cyberabad Police: మీరు జాగ్రత్తలు పాటించండి.. అందరినీ జాగ్రత్తగా ఉండేలా చేయండి..ఆకట్టుకుంటున్న సైబరాబాద్ పోలీసుల వీడియో!
Cyberabad Police
Follow us
KVD Varma

|

Updated on: May 18, 2021 | 2:51 PM

Cyberabad Police: కరోనా మహమ్మారి ఎక్కడా వదలను అంటోంది. అవకాశం దొరికితే ఇంకా నా వేషాలు మార్చుకుని మరింత బలంగా వస్తాను అని సవాల్ చేస్తోంది. ఇక్కడా.. అక్కడా అని కాకుండా అన్ని చోట్లా పట్టుకుని వేలాడుతూ ఉంటోంది కరోనా వైరస్. ఎవరైనా చెయ్యి వేస్తే చాలు ఇక ఎంచక్కా ఎంతమంది నైనా చుట్టబెట్టేయొచ్చు అన్నట్టుగా కరోనా కాచుకుని కూర్చుంటోంది. దీనిని సమూలంగా నిర్మూలించడం ఇప్పట్లో అయ్యేపనిలా కనిపించడం లేదు. ఇది కంటికి కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్దంలా అయిపొయింది పరిస్థితి. శత్రువు బలవంతుడైతే.. ఏదోరకంగా ఆ బలాన్ని మట్టుపెట్టే ప్రయత్నం చేయాలి. మట్టుపెట్టే పరిస్థితి లేకపోతే అతని బలాన్ని నరుక్కుంటూ రావాలి. అతని బలహీనత మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేయాలి. మరోవైపు మన బలహీనతను అధిగమిస్తూ పోవాలి. ఇప్పుడు కరోనాతో మనం చేయాల్సిన పని కూడా అదే. కరోనాను ఆపడం ఎవరితరం కాదని తేలిపోయింది. ఇప్పుడు మనం కరోనా వ్యాప్తిని అరికట్టే పనిని సంఘటితంగా చేయాలి. దీనికి ప్రభుత్వాలు.. అధికారులు.. ఎవరూ సహాయం చేయక్కర్లేదు. కరోనా అంటుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగే కన్నా.. జాగ్రత్తలు తీసుకుని దాని వ్యాప్తిని నిరోధిస్తూ పొతే ఎక్కడో ఒక చోట బ్రేక్ వస్తుంది. దానికి కావల్సింది సంకల్పం అంతే. ఇందుకోసమే మనకి అందరూ కరోనా వ్యాపించకుండా ఏం చేయాలన్నది పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక ఎనిమేటెడ్ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చాలా అర్ధవంతంగా.. చిన్న పిల్లలకు కూడా స్పష్టంగా తెలిసేలా వీడియో తయారు చేశారు. అందులో కరోనాను ఎదుర్కోవడానికి మనం పాటించాల్సిన ముచ్చటైన మూడు రూల్స్ చూపించారు.

ఒక యువకుడు.. ఒక పెద్దాయన బస్టాండ్ లో ఉన్నారు. పెద్దాయన మాస్క్ పెట్టుకున్నాడు కానీ ముక్కుకు దిగువన. యువకుడు మాస్క్ పెట్టుకోలేదు. బస్టాప్ లో ఆ యువకుడు తన చేయిని పక్కనే ఉన్న స్తంభం మీద పెట్టాడు. అక్కడే కరోనా వైరస్ కాచుకుని ఉంది. అది ఈ యువకుడి చేతిని పట్టుకుంది. ఆ యువకుడు ఆ చేతితో తన ముక్కు రుద్దుకున్నాడు. కరోనాకు కావలసినదీ అదే. అంతే. ఇక ఆ యువకుడిని పట్టుకుంది.. ఆ యువకుడు దగ్గాడు దాంతో పక్కనే ఉన్న పెద్దాయన మీద వాలాయి కరోనా వైరస్ కణాలు. ఆ పెద్దాయన మాస్క్ పెట్టుకున్నా ముక్కు కవర్ కాలేదు. దీంతో అతనిని చక్కగా పట్టుకుని ఉన్నాయి కరోనా కణాలు. ఈలోపు అటుగా ఒక చిన్నారి, ఆమె తల్లి వెళుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ పెద్దాయన తుమ్మాడు. ఆ తుంపరలతో పాటు కరోనా కూడా ఆ తల్లీ, పిల్ల మీదకు చేరాయి. అయితే, అవి ఎంత ప్రయత్నం చేసినా వారి శరీరంలోకి ప్రవేశించలేకపోయాయి. ఎందుకంటే, వారిద్దరూ మాస్క్ సరిగా ధరించారు. ఇంటికి వెళ్ళిన ఆ ఇద్దరూ నేరుగా వాష్ రూమ్ కి వెళ్ళారు. మొదట తమ మాస్క్ లను సబ్బు నీళ్ళలో పాడేశారు. వాటిని శుభ్రంగా ఉతికింది తల్లి. ఆ దెబ్బకు కరోనా సబ్బునీళ్ళలో పడి విలవిలలాడింది. మాస్క్ లు ఆరబెట్టిన తరువాత తల్లీ, చిన్నారి ఇద్దరో చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కున్నారు. ఇదీ కరోనా కథ. ఇందులో అన్ని అంశాలూ ఇమిడిపోయాయి. 1. మాస్క్ ధరించాలి, 2. ఎట్టి పరిస్థితిలోనూ చేతితో ముక్కును తడమ కూడదు. 3. మాస్క్ ను ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. 4. ఒకరికి ఒకరు దగ్గరగా ఉండకూడదు. 5. బయట నుంచి ఇంటిలోకి వెళ్ళిన వెంటనే మాస్క్ శుభ్రం చేసుకుని, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వీటిని పాటిస్తే కరోనాకు అవకాశమే ఉండదు.

సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ఇదిగో..

సైబరాబాద్ పోలీసులు తమ ట్విట్టర్ లో ఈ పోస్ట్ పెట్టారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. మీ కోసం ఇక్కడ ఈ ట్వీట్ ఇస్తున్నాం. దీనిని అందరికీ షేర్ చేయండి.. అందరికీ తెలిసేలా చేయండి. కరోనా జాగ్రత్తలు పాటించండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా ఉంచండి.

Also Read: Hyderabad Constable Mahesh: హ్యాట్సాఫ్ కానిస్టేబుల్ గారు.. చిన్నారుల ఆక‌లి తీర్చిన‌ మ‌స‌నున్న పోలీస్

Hyderabad Crime News: అమ్మని తిట్టాడ‌ని.. ఇటుక రాయితో కొట్టి చంపేశాడు