Hyderabad Constable Mahesh: హ్యాట్సాఫ్ కానిస్టేబుల్ గారు.. చిన్నారుల ఆక‌లి తీర్చిన‌ మ‌స‌నున్న పోలీస్

హైదరాబాద్ పోలీసుల‌కు దేశవ్యాప్తంగా మంచిపేరుంది. నేర‌స్థుల తాట తీయ‌డంలో, క‌ష్టం వ‌చ్చిన‌వారి వెంట నిల‌వ‌డంలో వారు ఎప్పుడు ముందుంటారు.

Hyderabad Constable Mahesh: హ్యాట్సాఫ్ కానిస్టేబుల్ గారు.. చిన్నారుల ఆక‌లి తీర్చిన‌ మ‌స‌నున్న పోలీస్
Police Mahesh
Follow us

|

Updated on: May 18, 2021 | 9:57 AM

హైదరాబాద్ పోలీసుల‌కు దేశవ్యాప్తంగా మంచిపేరుంది. నేర‌స్థుల తాట తీయ‌డంలో, క‌ష్టం వ‌చ్చిన‌వారి వెంట నిల‌వ‌డంలో వారు ఎప్పుడు ముందుంటారు. తాజాగా మ‌రో ట్రాఫిక్ పోలీస్.. మాన‌వ‌త్వం చాటుకున్నాడు.  నిజమైన పోలీస్‌ అనే పదానికి చిరునామాగా నిలిచాడు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా మారిన పోలీసులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆకలి, దప్పికలు మరిచి చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు ఓ  ట్రాఫిక్ పోలీస్..

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహేశ్‌ రోడ్డుపై ఇద్దరు చిన్నారుల ఆకలి తీర్చాడు. లాక్‌డౌన్‌ విధుల్లో భాగంగా సోమాజిగూడలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డుపై ఇద్దరు చిన్నారులను మహేశ్‌ గుర్తించాడు. చౌరస్తాలో తమ ఆకలి తీర్చమంటూ దీనంగా వాహనదారులను అడుక్కుంటున్న వారిని చూసి చలించిపోయాడు. లాక్‌డౌన్‌ సమయంలో బయటికి ఎవరూ రాకపోవడంతో చిన్నారుల ఆకలి తీర్చేవారే కరువయ్యారు.

వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ వెంటనే స్పందించాడు. పిల్ల‌ల‌ను రోడ్డు పక్కన కూర్చోబెట్టాడు. తన ఇంటి నుంచి తెచ్చుకున్న మధ్యాహ్నం లంచ్‌బాక్స్‌ ఓపెన్‌ చేశాడు. ఆ చిన్నారులిద్దరికీ స్వయంగా వడ్డించాడు. పాపం.. ఆ చిన్నారులు కడుపు నిండా అన్నం తిని ఎన్నిరోజులైందో..! మహేశ్‌ వడ్డించిన ఆహారాన్ని ఆవురావురుమంటూ తినేశారు. ఈ ప‌రిణామంతో అప్పటి వరకు కన్నీళ్లతో ఎండిపోయిన చిన్నారుల ముఖంలో చిరునవ్వులు క‌నిపించాయి.

Also Read: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్న‌పూర్ణ క్యాంటీన్ల‌లో ఉచిత భోజ‌నం.. మంత్రి కేటీఆర్ కీల‌క ఆదేశాలు

 అమ్మని తిట్టాడ‌ని.. ఇటుక రాయితో కొట్టి చంపేశాడు