Hyderabad Crime News: అమ్మని తిట్టాడని.. ఇటుక రాయితో కొట్టి చంపేశాడు
ఫ్యామిలీ జోలికి వచ్చాడు. అందునా తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆ వ్యక్తికి తిక్కరేగింది. స్నేహితుడు అని కూడా చూడకుండా ఇటుకతో కొట్టి...
ఫ్యామిలీ జోలికి వచ్చాడు. అందునా తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆ వ్యక్తికి తిక్కరేగింది. స్నేహితుడు అని కూడా చూడకుండా ఇటుకతో కొట్టి హతమార్చాడు. నిందితుడిని నేరేడ్‌మెట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. నేరేడ్‌మెట్ అనంత్‌నగర్ ఈస్ట్ కృపా అపార్టుమెంటులో నివాసం ఉంటున్న ఎం.శ్యాంసుందర్(31), అదే స్ట్రీట్ లో విజయ అపార్టుమెంటులో ఉండే ఫలగం నవీన్‌లు ఫ్రెండ్స్. నవీన్ ఆటో డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.శ్యాంసుందర్ మాత్రం ఖాళీగా ఉంటున్నాడు. శ్యాంసుందర్ తరచూ నవీన్‌పై పెత్తనం చెలాయిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఈ క్రమంలో శ్యాంసుందర్ లిక్కర్ తాగిన మత్తులో ఆదివారం రాత్రి.. నవీన్ ఇంటికెళ్లి అతని తల్లిని బూతులు తిట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆగ్రహంతో నవీన్ అర్ధరాత్రి 1:30కి శ్యాంసుందర్ ఇంటికి వెళ్లి నిద్రలేపి.. మా అమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో నవీన్ అక్కడే ఉన్న సిమెంటు ఇటుకతో శ్యాంసుందర్ తలపై గట్టిగా మోదాడు. దీంతో అతను స్పాట్ లోనే మృతి చెందాడు. మృతుడి తల్లి రేణుక కంప్లైంట్ మేరకు పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచిత భోజనం.. మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు