Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు!
Sushil Kumar Case: ఢిల్లీలో ఒక యువకుడిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అతని ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు.
Sushil Kumar Case: ఢిల్లీలో ఒక యువకుడిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అతని ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. ఇప్పటికే పోలీసులు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసారు. లుకౌట్ నోటీసులు కూడా జరీ చేశారు. పలు పోలీసు బృందాలు సుశీల్ కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో సుశీల్ కుమార్ తో పాటు మరో వ్యక్తీ అజయ్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆటను కూడా ఇప్పటివరకూ పోలీసులకు చిక్కలేదు. దీంతో ఇతనిపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు పోలీసులు. పోలీసులు ఇద్దరి కోసం ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ దొరకకపోవడంతో వారిద్దరినీ పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయలు, అజయ్ ఆచూకీ తెలిపినవారికి 50 వేల రూపాయలు రివార్డ్ ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
ఆచూకీ దొరకని ఈ నిందితుల పై లుకౌట్ నోటీసు జారీ చేసిన తరువాత కూడా ఈ కేసులో సుశీల్ కుమార్ పోలీసులకు దొరకలేదు. ఢిల్లీ లో ఒక ఆస్తి వివాదంపై ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు. మృతుడు సాగర్, అతని స్నేహితులు నివసించిన ఇంటిని ఖాళీ చేయమని సుశీల్, అజయ్ వారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ కారణంగా వారం క్రితం స్టేడియం లోపల రెజ్లర్ల రెండు గ్రూపులు ఒకరితో ఒకరు గొడవ పడ్డాయి. ఇందులో 5 మంది రెజ్లర్లు గాయపడ్డారు. వారిలో ఒకరు సాగర్ (23) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతను ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కావడం గమానార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో గత మంగళవారం రాత్రి 1.15 మరియు 1.30 మధ్య ఈ సంఘటన జరిగింది. సమాచారం పోలీసులకు చేరగానే అక్కడ 5 వాహనాలు నిలబడి ఉన్నట్లు గుర్తించారు. సాగర్, అతని 4 ఇతర రెజ్లింగ్ సహచరులు గాయపడిన స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో సోను (37), అమిత్ కుమార్ (27), మరో 2 మంది రెజ్లర్లు ఉన్నారు.
ఈ ఆరోపణలపై సుశీల్ వివరణ ఇచ్చారు. అతను మా తోటి మల్లయోధుడు కాదని చెప్పాడు. ఈ సంఘటన అర్థరాత్రి జరిగింది. కొంతమంది తెలియని వ్యక్తులు మా ప్రాంగణంలోకి ప్రవేశించి తగాదా చేస్తున్నారని మేము పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చాము. ఈ సంఘటనతో మా స్టేడియానికి ఎటువంటి సంబంధం లేదు. అంటూ సుశీల్ చెప్పుకొచ్చాడు. తరువాత నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. సుశీల్ కుమార్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం, బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు.