Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..
దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా రోజు రోజూకీ గణనీయంగా పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా రోజు రోజూకీ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ ప్రతి ఇంట్లోనూ చీకట్లను నింపుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొంత మంది తమ ఆత్మీయులను పోగొట్టుకున్నారు. టాలీవుడ్ నటులు, దర్శకులు, రచయితలు ఇలా చాలా మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదాన్ని నింపింది.
సుడిగాలి సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కరోనాతో కన్నుముశారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు రాం ప్రసాద్ ఓ షోలో వెల్లడించాడు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెల్లలేకపోయాడని.. చివరి చూపులు కూడా దక్కలేదని రాం ప్రసాద్ తెలిపాడు. ఆ సమయంలో అతని పక్కనే ఉన్న సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు సినీ ఇండస్ట్రీపై ఈ వైరస్ మరోసారి తీవ్రంగా దెబ్బకొట్టింది. కరోనా బారిన పడి పలువురు నటీనటులు హోం ఐసోలేషన్ లో ఉండగా.. సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన అల్లు అర్జున్ ఇటీవలే కోలుకున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం క్యారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.
పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..
పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..