సినీ పరిశ్రమలో పెను విషాదం.. ఇండస్ట్రీలో కరోనా కల్లోలం.. ఆక్సిజన్ అందక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తల్లి మృతి..

Director Subbu: కరోనా రెండో దశ.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో విషాదాన్ని నింపింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన

సినీ పరిశ్రమలో పెను విషాదం.. ఇండస్ట్రీలో కరోనా కల్లోలం.. ఆక్సిజన్ అందక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తల్లి మృతి..
Director Subbu
Follow us

|

Updated on: May 17, 2021 | 9:28 PM

Director Subbu: కరోనా రెండో దశ.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో విషాదాన్ని నింపింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలువురు సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. అలాగే తమ అయినవారిని కూడా కోల్పోతున్నారు. ఇక దేశంలోని ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కరోనా నియంత్రణకు పలువురు నటీనటులు తమకు తోచిన సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. బెడ్స్, ఆక్సిజన్ అందించేందుకు కృషిచేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్ కొరత టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుబ్బు ఇటీవల ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కించారు. లాక్ డౌన్ అనంతరం తెరుచుకున్న థియేటర్లలో ఈ సినిమా మొదటిగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుబ్బు తల్లి కరోనా కారణంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎంతగా ట్రై చేసినా.. సుబ్బు మదర్‌ని కాపాడుకోలేకపోయాం’ అంటూ సాయి ధరమ్ పోస్ట్ చేశారు. తన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర దర్శకుడు సుబ్బు తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో సుబ్బు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది.

Also Read: పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి తగ్గుతుంది… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..