Bandi Sanjay : వడ్లు పండించిన రైతులను టీఆర్ఎస్ సర్కార్ నట్టేట ముంచింది : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Telangana BJP President : తెలంగాణలో వడ్లు పండించిన రైతులను టీఆర్ఎస్ సర్కార్ నట్టేట ముంచిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు...

Bandi Sanjay : వడ్లు పండించిన రైతులను టీఆర్ఎస్ సర్కార్ నట్టేట ముంచింది : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay
Follow us
Venkata Narayana

|

Updated on: May 18, 2021 | 3:19 PM

Telangana BJP President : తెలంగాణలో వడ్లు పండించిన రైతులను టీఆర్ఎస్ సర్కార్ నట్టేట ముంచిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటి వరకు యాసంగి సీజన్ లో పండించిన పంటలో 40 శాతం ధాన్యం కూడా కొనలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. 1. 20 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని అంచనా వేస్తే.. కనీసం 30 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని బండి సంజయ్ అన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ తమిళసైని కోరిన బండి సంజయ్.. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు. దానివల్లే పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటులో చికిత్స కోసం పేదలు ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారన్న ఆయన, కేంద్ర పథకం ‘ఆయుష్మాన్ భారత్’లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే.. ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా కూడా కరోనా చికిత్స ఉచితంగా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేస్తామని చెప్పి మరీ సీఎం కేసీఆర్ మాట తప్పారని బండి సంజయ్ అన్నారు.

Read also : Budget : కరోనా కష్టకాలంలో ఏపీ సర్కారుకు కత్తి మీద సాములా పద్దుల రూపకల్పన.. 9 నెలల కాలానికి ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్