మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..
Hyderabad News Update: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ప్రతీ రోజూ మరింత కఠినంగా డ్రంకెన్...
Hyderabad News Update: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ప్రతీ రోజూ మరింత కఠినంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఎవరైనా నిబంధనలను అతిక్రమించి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. అలాగే పబ్‌లు, బార్లలపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పబ్ నిర్వాహకులే కస్టమర్లకు డ్రైవర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఇక డ్రంకెన్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, 3 నెలల జైలు శిక్ష.. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read:
వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్