పిల్లల సాక్ష్యంతో తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. కన్నబిడ్డలు ఇచ్చిన సాక్ష్యంతో దర్యాప్తు చేపట్టిన బేగంబజార్ పోలీసులు భర్త సాబిర్ ను అరెస్ట్ చేశారు.

భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. కన్నబిడ్డలు ఇచ్చిన సాక్ష్యంతో దర్యాప్తు చేపట్టిన బేగంబజార్ పోలీసులు భర్త సాబిర్ ను అరెస్ట్ చేశారు.
బేగంబజార్ కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మాద్ సాబిర్(35) భార్య రూబినా(26)నలుగురు పిల్లలతో కలసి నివాసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారేసరికి భార్య రూబినా చనిపోవడంపై అనుమాన్సద కేసుగా నమోదు చేసుకున్న బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వారి నలుగురు పిల్లలలో ఇద్దరు ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సాక్ష్యమిచ్చారు. ఆరేళ్ల బాలుడు, అతని ఐదేళ్ల సోదరి చెప్పిన మాటలకు పోలీసులు నిర్ఘాంతపోయారు. వారి తండ్రి మొహమ్మద్ సాబిర్ మొదట వారి తల్లి రూబినాను చంపి ఉరి వేశాడం తాము చూశామని పోలీసులకు వివరించారు. వారి చిన్న పిల్లలు కావడంతో ఏమి జరిగిందో అర్థం చేసుకోలేక.. వారు తిరిగి నిద్రలోకి వెళ్ళారని బేగం బజార్ సీఐ మధు మోహన్ రెడ్డి తెలిపారు. ఒకరు ఆరేళ్ల వయసు కలిగిన బాలుడు కాగా మరొకరు ఐదేళ్ల బాలిక మిగతా ఇద్దరు పిల్లలు కేవలం రెండు, ఒక సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలే. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు పిల్లలతో నిద్రపోతున్న సమయంలో రుబినాను సాబిర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు.
గత కొన్ని నెలలుగా దంపతులిద్దరి మధ్య తరచుగా చిన్న సమస్యల గురించి గొడవలు జరుగుతున్నారు. కుటుంబంలోని పెద్దలు జోక్యం చేసుకుని సర్థి చెబుతూనే ఉన్నారు. రుబినా తన తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడల్లా అనుమానంతో ఆమెపై దాడికి పాల్పడుతున్నట్లు స్ధానికులు తెలిపారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి తీవ్ర వాగ్వాదానికి దిగారని.. స్థానికులు సర్ధి చెప్పడంతో వారు నిద్రలోకి వెళ్లిపోయారని ఇన్స్ పెక్టర్ చెప్పారు. కన్న పిల్లలు ఇద్దరూ తండ్రి సాబిర్ చేసిన పనిని పోలీసులకు కళ్లకు కట్టినట్లు చేతి సంజ్ఞలతో వివరించారని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటలకు తల్లి మేల్కొనకపోవడంతో పిల్లలు ఇరురుపొరుగు వారికి సమాచారమిచ్చారని. దీంతో స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బేగంబజార్ సీఐ మధుమోహన్ వారి పిల్లల ఇచ్చిన సాక్ష్యంతో సాబిర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.
