AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కలా చచ్చిపోయాడు.. బాగ్దాదీ మృతిపై ట్రంప్.. మూవీలా చూసిన ‘పెద్దన్న’

ఐసిస్ నాయకుడు, వాల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అబూ బకర్ అల్-బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీ లింక్ లో ‘ ఓ మూవీ ‘ లా చూశాడట. అతడ్ని మట్టుబెట్టిన తీరును తాను ఒక విధంగా ‘ ఎంజాయ్ ‘ చేశానంటున్నాడు. సిరియాలోని ఇద్ లిబ్ ప్రావిన్స్ లో బాగ్దాదీని అమెరికా సైనికదళాలు చుట్టుముట్టి హతమార్చిన సంగతి తెలిసిందే. అసలు కరడు గట్టిన ఈ ఉగ్రవాది ఎలా మరణించాడు […]

కుక్కలా చచ్చిపోయాడు.. బాగ్దాదీ మృతిపై ట్రంప్.. మూవీలా చూసిన 'పెద్దన్న'
Anil kumar poka
|

Updated on: Oct 28, 2019 | 11:51 AM

Share

ఐసిస్ నాయకుడు, వాల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అబూ బకర్ అల్-బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీ లింక్ లో ‘ ఓ మూవీ ‘ లా చూశాడట. అతడ్ని మట్టుబెట్టిన తీరును తాను ఒక విధంగా ‘ ఎంజాయ్ ‘ చేశానంటున్నాడు. సిరియాలోని ఇద్ లిబ్ ప్రావిన్స్ లో బాగ్దాదీని అమెరికా సైనికదళాలు చుట్టుముట్టి హతమార్చిన సంగతి తెలిసిందే. అసలు కరడు గట్టిన ఈ ఉగ్రవాది ఎలా మరణించాడు ? యుఎస్ దళాల దాడి నుంచి ఇక తనను తాను రక్షించుకునే మార్గం కనబడకపోవడంతో బాగ్దాదీ.. తన ముగ్గురు పిల్లలనూ లాక్కుంటూ ..తనకు రక్షణ కవచంలా వాడుకుంటూ ఓ సొరంగంలోకి పారిపోయాడు. అయితే అమెరికా సైనికులు తనను పట్టుకునేందుకు ముందుకు చొచ్ఛుకు రావడంతో తన పిల్లలను హతమార్చి.. సూసైడ్ వెస్ట్ తో తనను తాను పేల్చేసుకున్నాడు. బాగ్దాదీ భార్యల్లో ఒకరిని, అతడి మేనల్లుడిని, అతని సహచరుల్లో ఒకరి భార్యను ఇరాక్-కుర్దిష్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. (ఇక బాగ్దాదీ అనంతరం ఐసిస్ కొత్త చీఫ్ గా గతంలో సద్దాం హుసేన్ హయాంలో అతని వద్ద పని చేసిన అబ్దుల్లా ఖర్దాష్ అనే వ్యక్తి ఎంపికవుతాడట). బాగ్దాదీ కథ ఎలా ముగిసిందంటే ?

సిరియాలోని బరీషాలో గల మారుమూల గ్రామమది.. అక్కడ బాగ్దాదీ తన కుటుంబంతో తలదాచుకున్నాడన్న విషయం తమ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అమెరికా సైనికులు, విమానాలు, హెలికాఫ్టర్లతో ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. శనివారం అర్దరాత్రి చీకట్లో చడీచప్పుడు లేకుండా అతడు ఉంటున్నాడని భావించిన ఇంటివద్దకు చేరుకున్నారు. బాగ్దాదీ సహచరులకు వీరు వస్తున్న విషయం తెలియనే లేదట. మొదట హెలీకాఫ్టర్లలో ఒకటి ఇతడి ఇంటిని, ఓ కారును టార్గెట్ చేసింది. ఈ హెలికాప్టర్లోని ఎలైట్ డెల్టా ఫోర్స్ కమాండోలు, రేంజర్లు మెల్లగా కిందికి దిగారు. అధునాతన ఆయుధాలు, అత్యంత సునిశిత శిక్షణ పొందిన శునకాలతోను, ఓ రోబోతోను దాదాపు 70 మందితో కూడిన ఈ దళం ‘ బ్లడ్ బాత్ ‘ కి సిధ్ధమైంది. ‘బాగ్దాదీని పట్టుకోండి..లేదా హతమార్చండి ‘ అన్నదే ట్రంప్ వీరికి ఇఛ్చిన ఆదేశం. (వైట్ హౌస్ లో ట్రంప్ ఈ బ్లడ్ బాత్ ని తన అధికారులతో కలిసి టీవీలో లైవ్ గా చూశాడు). మొత్తానికి తన పని ఖతమని తెలిసిన బాగ్దాదీ.. తన ముగ్గురు పిల్లలతో కలసి ఓ టన్నెల్ లోకి పారిపోయాడు. అప్పుడే సూసైడ్ సూట్ లు ధరించిన అతని ఇద్దరు భార్యాలు తమను తాము పేల్చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఆ ప్రయత్నం విఫలమైంది. అయితే అమెరికా దళాల కాల్పుల్లో వారు మరణించారు. బాగ్దాదీని లొంగిపోవాల్సిందిగా సైనికులు కోరినప్పటికీ అతడు వినలేదు. సొరంగం చివరి వరకూ వెళ్లిన అతగాడు ఇక మరో మార్గం లేక తన సూసైడ్ బెల్ట్ తో తనకు తాను పేల్చుకున్నాడు. కాగా. యుఎస్ దళాల కాల్పులతో ఆ ప్రాంతమంతా శ్మశాన భూమిని తలపిస్తోంది.