దేశరాజధానిలో ఉక్కిరి బిక్కిరిగా.. ప్రాణాలు హరి అంటాయా..!

దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముందు నుంచీ అక్కడ ఎక్కువగా వాయు కాలుష్యం హై రేంజ్‌లో రికార్డు అయ్యింది. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. దీంతో జనం ఊపరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని […]

దేశరాజధానిలో ఉక్కిరి బిక్కిరిగా.. ప్రాణాలు హరి అంటాయా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 28, 2019 | 11:47 AM

దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముందు నుంచీ అక్కడ ఎక్కువగా వాయు కాలుష్యం హై రేంజ్‌లో రికార్డు అయ్యింది. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. దీంతో జనం ఊపరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అధికారులు తెలిపారు.

గ్రీన్ దివాళి.. అని ఒక పక్క ప్రభుత్వాలు.. మరో పక్క.. పర్యావరణ ప్రేమికులు.. అలాగే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోలేదు. హెచ్చరికలను పెడచెవిన పెట్టిన నగర వాసులు భారీగా బాణా సంచాను కాల్చారు. దాంతో.. ఒక రేంజ్‌లో ఢిల్లీ నగర వ్యాప్తంగా దట్టమైన పొగ అలుముకుంది. పెరిగిన వాయు కాలుష్యంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. దీంతో.. అక్కడి వారికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇక పాదాచారుల సంగతి.. ట్రాఫిక్ పోలీసుల సంగతి చెప్పనవసరంలేదు. నోటికి, ముక్కుకు.. మాస్క్‌లు ధరించి రోడ్లపైకి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని సహా గుర్‌గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, నోన్ పట్, బహదూర్ గఢ్ నగరాల్లో రాత్రి సమయంలో నిర్మాణ పనులను అక్టోబర్ 30 వరకూ పూర్తిగా నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ కమిటీ ప్రతిపాదించింది. బొగ్గు ఇంధనంగా ఉపయోగించే అన్ని పరిశ్రమలు, పవర్ ప్లాంట్‌లను కూడా మూసేయాలని చెప్పారు అధికారులు.

అంతేకాకుండా.. ఈ పొగ కారణంగా.. అనేక రోగాల బారిన ప్రజలు పడే అవకాశముందని.. ప్రజల ప్రాణాలకు చాల డేంజర్ అని.. సిగరెట్‌ కాల్చితే.. ఎలాంటి రోగాలు వస్తాయో.. ఈ పొగ పీల్చినా.. అటువంటివే వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఢిల్లీలో మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.