Banana Dry Fruits Milk Shake: బనానా – డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ని ఇలా చేసి పిల్లలకు ఇస్తే దృఢంగా ఉంటారు!
సాధారణంగా బయట రెస్టారెంట్స్, హోటల్స్, ఫ్రూట్ షాప్స్ లో మిల్క్ షేక్స్ ఉంటూనే ఉంటాయి. వాటిల్లో బనానా - డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ బనానా మిల్క్ షేక్ తాగడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా. ఇది తాగితే నీరసం, బలహీనత తగ్గుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిల్క్ షేక్ ఒక్కటి తాగినా.. కడుపు ఫుల్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా పిల్లలకు తయారు చేసి ఇవ్వడం..

సాధారణంగా బయట రెస్టారెంట్స్, హోటల్స్, ఫ్రూట్ షాప్స్ లో మిల్క్ షేక్స్ ఉంటూనే ఉంటాయి. వాటిల్లో బనానా – డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ బనానా మిల్క్ షేక్ తాగడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా. ఇది తాగితే నీరసం, బలహీనత తగ్గుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిల్క్ షేక్ ఒక్కటి తాగినా.. కడుపు ఫుల్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా పిల్లలకు తయారు చేసి ఇవ్వడం వల్ల.. వాళ్లు బలంగా, దృఢంగా తయారవుతారు. ఈ మిల్క్ షేక్ ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ బనానా – డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా – డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు:
అరటి పండ్లు, జీడి పప్పు, బాదం, మిల్క్, పంచదార లేదా పటిక బెల్లం, యాలకులు, నాన బెట్టిన సబ్జా గింజలు.
తయారీ విధానం:
ఈ మిల్క్ షేక్ తయారు చేసుకునే ముందు పాలను కాచి చల్లార్చాలి. ఆ తర్వాత కనీసం ఒక గంటైన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత పాలను కొద్దిగా మిక్సీ జార్ లో వేసు కోవాలి. ఆ తర్వాత అరటి పండ్ల ముక్కలు, జీడి పప్పు, బాదం, పంచదార, యాలకులు వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇలా తయారైన ఈ మిల్క్ షేక్ ని ఒక సర్వింగ్ గ్లాసులో తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, అరటి పండు ముక్కలు, సబ్జా గింజలు కొద్దిగా ఐస్ వేసుకోవాలి.
అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. దీన్ని ఇదే ప్రాసెస్ లో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఐస్ క్రీమ్ ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. కానీ హెల్దీగా తీసుకోవాలంటే.. ఐస్ క్రీమ్ లేకుండా తీసుకుంటేనే బెటర్. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. పండుగ సమయాల్లో, వీకెండ్స్ లో లేదా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేసుకోవచ్చు.