Telugu News Photo Gallery Rice water is best for uti infection and white discharge check here is details
Rice Water Benefits: వైట్ డిశ్చార్జ్ తో ఇబ్బంది పడుతున్నారా.. మీకు ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయ్!
మహిళల్ని వేధించే సమస్యల్లో ఈ వైట్ డిశ్చార్జ్ కూడా ఒకటి. ఈ సమస్య ప్రతి ఒక్క ఆడవారూ.. ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు.చాలా మంది ఈ సమస్యను చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వైద్యుల వద్దకు కూడా వెళ్లరు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ తర్వాత దీర్ఘకాలికంగా పలు సమస్యలు వెంటాడుతాయి. తెల్లని బట్ట, యూటీఐ మంటల వంటి సమస్యలతో లేడీస్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని తగ్గించడానికి బియ్యం వాటర్ బాగా హెల్ప్..
Rice Water 7
Follow us
మహిళల్ని వేధించే సమస్యల్లో ఈ వైట్ డిశ్చార్జ్ కూడా ఒకటి. ఈ సమస్య ప్రతి ఒక్క ఆడవారూ.. ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు.చాలా మంది ఈ సమస్యను చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వైద్యుల వద్దకు కూడా వెళ్లరు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ తర్వాత దీర్ఘకాలికంగా పలు సమస్యలు వెంటాడుతాయి. తెల్లని బట్ట, యూటీఐ మంటల వంటి సమస్యలతో లేడీస్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని తగ్గించడానికి బియ్యం వాటర్ బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా మంది మహిళలు వైట్ డిశ్చార్జ్ తో బాధ పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడేవారు రైస్ వాటర్ ను తాగడం వల్ల.. ఆ సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైస్ వాటర్ లో.. చలువ చేసే గుణం ఉంటంది. మహిళలు తరచుగా ఈ వాటర్ ను తాగితే మూత్రంలో చికాకు, రక్త స్రావం, హెవీ పీరియడ్స్, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంతే కాకుండా ఈ వాటర్ ను తాగినా, ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా, కాంతి వంతంగా తయారవుతుంది. పిగ్మంటేషన్ సమస్య కూడా దూరం అవుతుంది. జుట్టుకు రాస్తే బలంగా, దృఢంగా తయారవుతుంది.
రైస్ వాటర్ ను ఎలా చేస్తారంటే.. ఒక కప్పు బియ్యం తీసుకుని ఒకసారి మాత్రమే శుభ్ర పరుచుకోవాలి. ఆ తర్వాత ఇందులో రెండు లేదా మూడు కప్పుల నీటిని పోసి.. 2 నుంచి 3 గంటల వరకు అలానే వదిలేయండి. ఆ తర్వాత బియ్యాన్ని వడకట్టి ఆ నీటిని తాగవచ్చు.