AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!

వర్షాకాలం లేదంటే చలికాలంలో వేడివేడి బెల్లం టీ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి, ఉపశమనం లభిస్తాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, చాలామందికి బెల్లం టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే విరిగిపోకుండా పర్ఫెక్ట్ బెల్లం టీ తయారు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!
How To Make Jaggery Tea
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2026 | 7:01 AM

Share

బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చాలామందికి టీ తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లంలో ఉండే సహజ ఆమ్ల గుణం, పాలు మరిగే ఉష్ణోగ్రత కలవడం వల్ల పాలు విరుగుతాయి. సరైన పద్ధతి పాటిస్తే పాలు విరగకుండా అద్భుతమైన బెల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన బెల్లం టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే చిట్కాలు ఇవే!

పాలు ఎందుకు విరుగుతాయి?:

బెల్లంలో సహజంగానే కొంత ఆమ్లత్వం ఉంటుంది. మరిగే నీటిలో బెల్లం, పాలు ఒకేసారి వేసి ఎక్కువసేపు మరిగిస్తే, ఆ ఉష్ణోగ్రత వద్ద పాలు విరిగిపోతాయి. అందుకే ఉష్ణోగ్రత, బెల్లం వేసే సమయం చాలా ముఖ్యం.

పాలు విరగకుండా టీ చేయడానికి ముఖ్యమైన చిట్కాలు:

టీ డికాక్షన్ తయారు చేసేటప్పుడు పాలను నేరుగా నీటిలో వేసి మరిగించకూడదు. పాలను వేరే పాత్రలో బాగా కాచి, వేడిగా ఉన్నప్పుడే డికాక్షన్‌లో కలపాలి. నీటిలో టీ పొడి, అల్లం, యాలకులు లేదా మసాలా దినుసులు వేసి బాగా మరిగించాలి. డికాక్షన్ సిద్ధమైన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి లేదా మంట పూర్తిగా తగ్గించిన తర్వాత మాత్రమే బెల్లం కలపాలి. ఇది కూడా రసాయనాలు లేని శుద్ధమైన ఆర్గానిక్ బెల్లం లేదా బెల్లం పొడిని వాడటం వల్ల పాలు విరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బెల్లం టీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: నీరు – 1 కప్పు, పాలు – 1/2 కప్పు, టీ పొడి – 1 స్పూన్, తురిమిన అల్లం – చిన్న ముక్క, యాలకులు – 2, తురిమిన బెల్లం – 1 నుండి 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో టీ పొడి, అల్లం, యాలకుల పొడి వేసి 3-4 నిమిషాలు బాగా మరిగించండి. మరొక పాత్రలో పాలను వేడి చేయండి. డికాక్షన్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దించేముందు తురిమిన బెల్లం వేసి కరిగేలా కలపండి. ఇప్పుడు వేడిగా ఉన్న పాలను డికాక్షన్‌లో పోసి కలపండి. వేడివేడి సువాసనగల బెల్లం టీ సిద్ధం!

ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా మీ బెల్లం టీ ఎప్పటికీ విరిగిపోకుండా, అద్భుతమైన రుచితో తయారవుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ హెల్దీ టీని ఆస్వాదించండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us