సెప్టెంబర్ 1 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు!
Horoscope Today (September 1, 2026): మంగళవారం మేష రాశి వారికి ఆర్థికంగా సంతృప్తికరమైన పరిస్థితులు ఉండడంతో పాటు ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశివారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను అందించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంతో పాటు వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. సొంత పనులకు ప్రాధాన్యమివ్వడం శ్రేయస్కరం. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవ కాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. కొద్ది వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్త వుతాయి. కీలక విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడు తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల వల్ల ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా నెరవేరుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సా హంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అయితే, వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. పట్టుదలగా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబపరంగా కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యో గంలో అధికారులు, సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలా పాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. కుటుంబ పరిస్థితుల్ని చక్కబెడతారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడ తారు. రుణ భారం బాగా తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రులను నమ్మి ఆర్థికంగా నష్టపోతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక లావాదేవీలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయ త్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొల గిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరిం చుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలనిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ విస్తరిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది. పిల్లల పురోగతి గురించి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఒకటి రెండుచిన్నా చితకా సమస్యలు తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి బాగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభా లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడతుంది. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి లోటుండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పాటు రుణ భారం బాగా తగ్గే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.