భారత విమాన సర్వీసులపై హాంగ్‌ కాంగ్‌ అంక్షలు

కరోనా ప్రభావంతో మరోసారి హాంగ్ కాంగ్ ప్రభుత్వం.. భారత విమాన సర్వీసుల రాకపోకలపై అంక్షలు విధించింది.

భారత విమాన సర్వీసులపై హాంగ్‌ కాంగ్‌ అంక్షలు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 28, 2020 | 6:37 PM

కరోనా ప్రభావంతో మరోసారి హాంగ్ కాంగ్ ప్రభుత్వం.. భారత విమాన సర్వీసుల రాకపోకలపై అంక్షలు విధించింది. ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్‌ మళ్లీ రద్దు చేసింది. ముంబై టు హాంగ్‌ కాంగ్‌ విమానాలను రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

ఇటీవల భారత్ నుంచి హాంగ్ కాంగ్ వచ్చిన కొందరు ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మరోసారి నవంబర్‌ 10 వరకు ఎయిర్‌ ఇండియా విమానాలను రద్దు చేస్తున్నట్లు హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌ నుంచి విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్‌ రద్దు చేయడం ఇది నాలుగోసారి. ఢిల్లీ-హాంగ్‌ కాంగ్‌ విమాన సర్వీసులను ఆగస్టు 18 నుంచి 31 వరకు, సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 3 వరకు, అక్టోబర్‌ 17 నుంచి 30 వరకు ఆ దేశం రద్దు చేసింది.

మరోవైపు పలు ఆంక్షలు కూడా విధించింది. భారత్ నుంచి హాంగ్ కాంగ్ రావాలనుకునే ప్రయాణికులు 72 గంటల ముందుగా పరీక్షలో నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, ప్రయాణికులు హాంగ్‌ కాంగ్‌ చేరిన తర్వాత కూడా మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, నేపాల్, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్‌, అమెరికా దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని హాంగ్‌ కాంగ్‌ పేర్కొంది.