AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాల్‌ ట్యాంపరింగ్‌పై పుస్తకం రాయబోతున్న వార్నర్‌

రెండేళ్ల కిందట బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ అనే ఆటగాళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే! దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌లో ఈ సంఘటన జరిగింది.. అప్పట్లో ఈ ఘటన క్రికెట్‌ ఆస్ట్రేలియానే కాదు క్రికెట్‌ దేశాలన్నింటినీ కుదిపేసింది.. జెంటిల్మన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ ముక్కున వేలేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు.. ఉద్దేశపూర్వకంగా చేశారో లేక ఎవరో చెబితే […]

బాల్‌ ట్యాంపరింగ్‌పై పుస్తకం రాయబోతున్న వార్నర్‌
Balu
|

Updated on: Oct 28, 2020 | 6:20 PM

Share

రెండేళ్ల కిందట బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ అనే ఆటగాళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే! దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌లో ఈ సంఘటన జరిగింది.. అప్పట్లో ఈ ఘటన క్రికెట్‌ ఆస్ట్రేలియానే కాదు క్రికెట్‌ దేశాలన్నింటినీ కుదిపేసింది.. జెంటిల్మన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ ముక్కున వేలేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు.. ఉద్దేశపూర్వకంగా చేశారో లేక ఎవరో చెబితే చేశారో తెలియదు కానీ ఆ సంఘటన అయితే ఆటగాళ్లకు చెడ్డపేరే తెచ్చింది.. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు.. బాన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.. అయితే అప్పుడేం జరిగిందన్న విషయంపై ముగ్గురు ఆటగాళ్లు పెదవి విప్పలేదు.. నిజానిజాలు వివరించేందుకు బాల్‌ ట్యాంపరింగ్ ఘటనపై తన భర్త పుస్తకం రాయబోతున్నారని వార్నర్‌ భార్య క్యాండిస్‌ తెలిపింది.. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్లాన్‌ వార్నర్‌దేనని కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు క్యాండిస్‌. అది వేరొకరి ప్రమేయంతో జరిగిందన్నారు.. వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్క్‌సిన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వార్నర్‌ రాయబోయే పుస్తకంతో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

Follow Us
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి