పాక్ ఉగ్రవాదులపై భారత్ ఉక్కుపాదం, 18 మందిపై ప్రకటిత టెర్రరిస్టులుగా ముద్ర

పాకిస్తాన్ లోని 18 మందిని కరడు గట్టిన ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీరిలో ఆ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరులు, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఛోటా షకీల్, టైగర్ మెమన్ తదితరులున్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ( చట్ట వ్యతిరేక కార్యకలాపాల  నిరోధక చట్టం) కింద వీరిని ‘డె జిగ్నేటెడ్ టెర్రరిస్టులు’ గా ప్రకటించారు. ఇంకా హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలావుద్దీన్, […]

పాక్ ఉగ్రవాదులపై భారత్ ఉక్కుపాదం, 18 మందిపై  ప్రకటిత టెర్రరిస్టులుగా ముద్ర
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 27, 2020 | 6:32 PM

పాకిస్తాన్ లోని 18 మందిని కరడు గట్టిన ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీరిలో ఆ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరులు, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఛోటా షకీల్, టైగర్ మెమన్ తదితరులున్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ( చట్ట వ్యతిరేక కార్యకలాపాల  నిరోధక చట్టం) కింద వీరిని ‘డె జిగ్నేటెడ్ టెర్రరిస్టులు’ గా ప్రకటించారు. ఇంకా హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలావుద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్, జావేద్ చినా వంటివారిని కూడా ఈ లిస్టులో చేర్చారు. 1993 లో ముంబై వరుస పేలుళ్లకు సూత్రధారులైనవారిని  ప్రధాన ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. ఇలా ప్రకటించడం వల్ల వీరి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, అంతర్జాతీయ వేదికల్లో ఉగ్రవాదంపై మరింత ఉధృతంగా పోరాటం జరపడానికి ఇండియాకు మార్గం సుగమమవుతుంది.