AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నాలుగు జిల్లాల్లో న్యూ ఇయర్ వేడుకలు రద్దు.. అక్కడ రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం

హిమాచల్ ప్రదేశ్‌ సర్కార్ మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సివిలా, కులు, కాంగ్రా, మండి జిల్లాలో బహిరంగ న్యూ ఇయర్ వేడుకలు చరుపుకోవడానికి లేదు.

ఆ నాలుగు జిల్లాల్లో న్యూ ఇయర్ వేడుకలు రద్దు.. అక్కడ రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2020 | 1:42 AM

Share

హిమాచల్ ప్రదేశ్‌ సర్కార్ మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సివిలా, కులు, కాంగ్రా, మండి జిల్లాలో బహిరంగ న్యూ ఇయర్ వేడుకలు చరుపుకోవడానికి లేదు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కర్ఫ్యూను పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ భరద్వాజ్ తెలిపారు.

సిమ్లా, మండి, కాంగ్రా, కులు జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని భరద్వాజ్ పేర్కొన్నారు. అంతకు ముందు నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 వరకు నైట్‌ కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ కర్ఫ్యూ అమల్లో ఉంది. డిసెంబర్‌ 31 రోజున పార్టీలు ఉండవని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు సోమవారం తెలిపారు. తాగిన స్థితిలో తిరిగేవారిని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు పోలీసులు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తుల్లో డ్యూటీలో ఉంటారని తెలిపారు.

నగరంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నందున, డిసెంబర్ 31 రాత్రి అన్ని రకాల వేడుకలపై నిషేధం విధించారు. రాత్రి 9గంటల తర్వాత పోలీసులు అలాంటి చర్యలకు పాల్పడితే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.