AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్ : నో స్టాక్‌‌.. ఇది ఎక్కడో కాదు..బ్లడ్‌ బ్యాంకుల ముందు ఇలా..

కరోనా కారణంగా బ్లడ్ ఇచ్చే వారు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఆఫీసులు, కాలేజీలు నడవకపోవడంతో రక్తం ఇచ్చేవారే కరువయ్యారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ,

కరోనా ఎఫెక్ట్ : నో స్టాక్‌‌.. ఇది ఎక్కడో కాదు..బ్లడ్‌ బ్యాంకుల ముందు ఇలా..
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2020 | 12:42 AM

Share

కరోనా కారణంగా బ్లడ్ ఇచ్చే వారు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఆఫీసులు, కాలేజీలు నడవకపోవడంతో రక్తం ఇచ్చేవారే కరువయ్యారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రక్త తీవ్రత ఎక్కువగా ఉంది.

తిరుపతి రుయా ఆసుపత్రిలో గతేడాది 60 బ్లడ్ క్యాంప్స్ నిర్వహించి 8069 యూనిట్ల బ్లడ్ సేకరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 21 క్యాంప్స్ నిర్వహించినా.. 3700 యూనిట్లు కూడా సేకరించలేకపోయారు. గతంలో బర్త్‌ డేలు, వేడుకలకు రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు. కాని ఈసారి ఆ పరిస్థితి లేదు. ఫలితంగా రక్తం కొరత ఏర్పడింది. అరుదైన గ్రూప్‌లకు బ్లడ్ దొరకడం కష్టంగా మారింది. దాతలు ముందుకు వస్తే తప్పా.. సమస్యను అధిగమించలేమంటున్నారు వైద్యులు.

కరోనా వైరస్‌ తర్వాత రక్తం దానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు ఘననీయంగా తగ్గిపోయాయి. దీంతో వైద్యం అందించడం వైద్యులకే సవాలుగా మారింది. ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. బ్లడ్‌ అత్యవసరమైన తలసీమియా బాధితులు తలలు పట్టుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 10 వేల మంది పిల్లలు తలసీమియాతో బాధ పడుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వీరికి పుట్టిన నాల్గో నెల నుంచి ప్రతీ రెండు లేదా 3 వారాలకోసారి బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. అయితే కరోనా ఎంటర్ అయ్యాక బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయి. దీంతో వీరికి బ్లడ్ ఎక్కించడం చాలెంజింగ్‌గా మారిందని వైద్యులు చెబుతున్నారు.

వీరికి ఎప్పటికప్పుడు కొత్త బ్లడ్ ఎక్కిస్తేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని, లేదంటే ప్రాణానికే ప్రమాదమంటున్నారు. ఒక్క తలసీమియా బాధితులకే కాదు, రోడ్డు ప్రమాదాల్లో బ్లడ్‌ లాస్‌ అయిన వారికి, అత్యవసరంగా సర్జరీలు చేయాల్సి ఉన్న వారికి అత్యవసరం. అయితే రక్తం కొరత మాత్రం అటు వైద్యులనే కాకుండా ఇటు సామాన్య జనాలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది.