AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నో పెళ్లి’ సాంగ్.. పాటలో రచ్చ చేసిన రానా, వరుణ్‌లు

'ప్రతీరోజూ పండగే' చిత్రంతో అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదలకు ఆటంకం..

'నో పెళ్లి' సాంగ్.. పాటలో రచ్చ చేసిన రానా, వరుణ్‌లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2020 | 5:05 PM

Share

‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడింది. తాజాగా ఈ సినిమాలోని ‘నో పెళ్లి’ సాంగ్‌ని.. హీరో నితిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ పాటలో టాలీవుడ్ హీరోలు రానా, వరుణ్ తేజ్‌లు కూడా కనిపించి అలరించారు.

ప్రస్తుత సిచ్యువేషన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా ‘నో పెళ్లి’ అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు నితిన్. పాటతో పాటే.. ‘నేనూ చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో.. కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుంది గానీ.. చేసుకోవడం మాత్రం పక్కా’ అంటూ ఓ పంచ్ డైలాగ్ వేశాడు నితిన్. సినిమాలో వెన్నెల కిషోర్ పెళ్లి సందర్బంగా వచ్చే ఈ పాటను ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ పాటలో మెగా హీరో వరుణ్ తేజ్, త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోన్న రానా కూడా దర్శనమిచ్చారు. ఈ పాటకి తమన్ సంగీతమందించగా.. అర్మాన్ మాలిక్ పాడారు.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ కానుండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

Read More: 

స్కుళ్లు ఓపెన్ చేసిన తొలిరోజే.. జగనన్న విద్యా కానుక

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడికి ఇష్టమైన ఆ 3 రాశులు ఇవే!
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడికి ఇష్టమైన ఆ 3 రాశులు ఇవే!
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల