మాస్ డైరెక్టర్‌కు షాకిచ్చిన యంగ్ హీరో.. ఏకంగా బోయపాటి సినిమాకే నో చెప్పేశాడట.. అసలు కారణమిదే..
నందమూరి బాలకృష్ణతో సింహా, లెజండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు పొందాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి
నందమూరి బాలకృష్ణతో సింహా, లెజండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు పొందాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి హీరో బాలకృష్ణతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై నందమూరి అభిమానులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు.
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ఓ నెగిటివ్ పాత్ర కోసం తెలుగు కుర్రహీరో నిఖిల్‌ను సంప్రదించారట. బోయపాటి ఆ నెగిటివ్ పాత్ర గురించి చెప్పగానే.. నిఖిల్ నో చెప్పేశాడట. ఇందుకు కారణం.. ఆ పాత్రలో ఎక్కువగా హింస ఉంటుందని.. పైగా నెగిటివ్ రోల్లో మితిమీరిన హింస ఉంటుదనే భయంతో రిస్క్ చేయలేక నో చెప్పేశాడట. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ-2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఈ యంగ్ హీరో పెళ్ళి చేసుకోని ఓ ఇంటివాడయ్యాడు.