MS Dhoni’s farm vegetables : రాంచీ టు దుబాయ్.. ధోనీ వ్యవసాయ క్షేత్రంలోని కూరగాయలకు ఫుల్ డిమాండ్..
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి అప్పుడు.. ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలకు..

MS Dhoni’s Farm Vegetables : టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి అప్పుడు.. ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలకు కూడా అదే తరహా డిమాండ్ ఉంది. రాంచీ నగర శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాంచీ శివార్లలోని సెంబో గ్రామంలోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిలను మహి స్పెషల్ పండిస్తున్నారు. ధోని పండించిన కూరగాయలకు రాంచీ మార్కెటులో ఫుల్ డిమాండ్ ఉంది.
ఝార్ఖండ్ డైనమేట్ తన రాంచీ ఫామ్‌హౌస్‌లో పండిస్తున్న క్యాబేజి, టమోటా, ఇతర కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. తాను పండించిన ఆర్గానిక్ కూరగాయలను దుబాయ్ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎంఎస్ ధోని ఏజెన్సీని ఎంపిక చేశారు. ధోని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది. ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ధోని కూరగాయలను దుబాయ్‌లో అమ్మనున్నారు. ఇవి ఆర్గానిక్ పంటలు కావడంతో దుబాయ్‌లో మంచి డిమాండ్ ఉంటుందని ధోనీ టూమ్ అనుకుంటోంది.
ఇదే ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కింద ధోని పండించిన కూరగాయలను ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని మార్కెట్ అంటున్నారు. ధోనికి దుబాయ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం కూడా ఓ ప్లెస్ అని వారు అంటున్నారు. ప్రస్థుతం నూతన సంవత్సర వేడుకలను ధోనీ దుబాయ్‌లో జరుపుకుంటున్నారు.
Also Read :
హైదరాబాద్‌లో భారీ చోరీ.. నమ్మకంగా ఉంటాడనుకుంటే నట్టేట ముంచాడు.. అందినకాడికి దోచుకుని ఉడాయించాడు..




