AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine Dry Run Live Updates : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్.. తెలుగు రాష్ట్రాల్లో కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌..

వ్యాక్సిన్‌ లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కొవిన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సూచించిన సమయానికి వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు చేరుకుంటున్నారు.

Corona Vaccine Dry Run Live Updates : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్.. తెలుగు రాష్ట్రాల్లో కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌..
Sanjay Kasula
|

Updated on: Jan 02, 2021 | 12:34 PM

Share

Corona Vaccine Dry Run : దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ విజయవంతం అయ్యింది. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డ్రై రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ చేపట్టారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jan 2021 12:32 PM (IST)

    దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం..-కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

    ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​లో భాగంగా ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. డ్రై రన్ ​జరుగుతున్న తీరును   పరిశీలించారు.

  • 02 Jan 2021 12:18 PM (IST)

    దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్..

    కోవిడ్ వ్యాక్సిన్​ పంపిణీ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్​ చేపట్టింది. 116 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో శనివారం ఉదయం డ్రై రన్​ ప్రారంభమైంది. ఈ డ్రై రన్​ ద్వారా వ్యాక్సిన్​ పంపిణీకి ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును పరిశీలిస్తున్నారు. టాస్క్​ఫోర్స్​ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. మండల, బ్లాక్​ స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు కొవిన్​ యాప్​లో అప్​లోడ్​ చేస్తున్నారు.

  • 02 Jan 2021 12:06 PM (IST)

    డ్రై రన్​ ఇలా చేస్తారు.. ఇందులో వ్యాక్సిన్ ఇవ్వరు..

    వ్యాక్సిన్ డ్రై రన్​లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్​లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు.

    ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉంటారు.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్​లైన్​లో రికార్డు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో ఉండే సమస్యలను గుర్తించి పరిష్కరించి… అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన టార్గెట్. అయితే డ్రైరన్​లో ఎక్కడా వ్యాక్సిన్​ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్​గా మాత్రమే చేస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్​లో అధికారులు పొందుపరచనున్నారు.

  • 02 Jan 2021 11:55 AM (IST)

    మరికొన్ని రోజుల్లో కొవిడ్‌ వ్యాక్సిన్ పంపిణీ..మణిపూర్‌లో కొనసాగుతున్న డ్రై రన్

    కొవిడ్‌ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో..  దేశవ్యాప్తంగా డ్రైరన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మణిపూర్‌లో నిర్ణయించిన కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు.

  • 02 Jan 2021 11:46 AM (IST)

    దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌.. ఏపీ, తెలంగాణలోనూ ప్రారంభం.. పరిశీలించిన కేంద్రమంత్రి

    మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్​ జరుగుతోంది. డ్రైరన్​లో పాల్గొనే 25మంది సమాచారాన్ని ఇప్పటికే టీకా ఆప్​లో నిక్షిప్తం చేసి ఉంచారు. డ్రైరన్​ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా… కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే బృందాలు పర్యవేక్షిస్తున్నారు.

  • 02 Jan 2021 11:34 AM (IST)

    కరోనా వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఉచితంగా అందిస్తాం..

    ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ దర్యాగంజ్‌లోని టీకా కేంద్రాన్ని సందర్శించి టీకా డ్రై రన్‌ను సమీక్షించారు. ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎలాగైనా ఉచితంగా అందిస్తుని తెలిపారు.

  • 02 Jan 2021 11:15 AM (IST)

    దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో..

    కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి దేశంలో ముందడుగు పడిన వేళ ఇవాళ టీకా డ్రైవ్ రన్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ ఈ ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్ లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు.

  • 02 Jan 2021 10:59 AM (IST)

    కేరళలో కొనసాగుతున్న డ్రై రన్..

    కేరళలో డ్రై రన్ కొనసాగుతోంది. టీకా ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తారు. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలోనే వ్యాక్సినేటర్లను ఉంచి… టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులను గుర్తించి.. కొవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు

  • 02 Jan 2021 10:38 AM (IST)

    తెలంగాణలో కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్..

    తెలంగాణలో కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్ కార్యక్రమం మొదలైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ప్రక్రియ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 3 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డ్రై రన్ నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ఇస్తారు.

  • 02 Jan 2021 10:17 AM (IST)

    విశాఖలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్‌..

    కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో.. పలు ఆసుపత్రులతో పాటు సింహాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్‌ను నిర్వహింస్తున్నారు. సుమారుగా రెండు గంటల పాటు ఈ డ్రై రన్ కొనసాగనుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు.. సుమారు 25 మందితో ఈ రోజు డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వాటిలో ఎదురయ్యే సవాళ్లను ఇబ్బందులను ఆరోగ్యశాఖకి పంపించనున్నారు.

  • 02 Jan 2021 10:03 AM (IST)

    ఢిల్లీలో డ్రై రన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్..

    కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​లో భాగంగా ఢిల్లీలోని జీటీబీ(GTB ) ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. డ్రై రన్​ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.

  • 02 Jan 2021 09:53 AM (IST)

    దేశవ్యాప్తంగా మొదలైన డ్రై రన్..

    డ్రై రన్‌ దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు.

  • 02 Jan 2021 09:41 AM (IST)

    వివిధ రాష్ట్రాల్లో డ్రై రన్ ఇలా నిర్వహిస్తారు..

    2గంటల వ్యవధిలో 25 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు టైం శ్లాట్‌ ఇవ్వాలి. ఒకటవ వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌ లబ్ధిదారుల పేర్లు, అడ్ర్‌సలు, వివరాలు పరిశీలిస్తారు. రెండవ వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌ కొవిన్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తారు. అనంతరం డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు కొవిన్‌లో రిపోర్టు చేస్తారు. మూడవ వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌ క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తారు. వ్యాక్సిన్‌ పొందినవారు 30 నిమిషాల పాటు విశ్రాంతి గదిలో వేచి ఉండాలి. ఈ విధంగా వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు.

  • 02 Jan 2021 09:32 AM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో..తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్​లలో డ్రై రన్‌..

    ఈ ఉదయం 9 గంటలకు కొవిడ్‌ టీకా డ్రై రన్‌ ప్రారంభంకానుంది. ఒక్కో జిల్లాలో మూడు చోట్ల కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్​లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్​సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు.

  • 02 Jan 2021 09:27 AM (IST)

    అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలు.. డ్రైరన్‌లో తప్పనిసరి..

    అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలును… డ్రైరన్‌లో తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు, ఆరడుగుల దూరాన్ని అందరూ పాటించాల్సిందే. ప్రతి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్… శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

  • 02 Jan 2021 09:05 AM (IST)

    ఈనెల 4లోగా ‘కొవిన్‌’ వెబ్‌సైట్‌లో టీకా పూర్తి వివరాలు..

    తెలుగు రాష్ట్రాల్లోని పురపాలక, నగరపాలక సంస్థల్లోని ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి కరోనా టీకా ఇచ్చేందుకు వారి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర పురపాలకశాఖను ఆదేశించింది. ‘కొవిన్‌’ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ఈనెల 4లోగా అప్‌లోడ్‌ చేయాలని కేంద్రం సూచించింది. కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ అన్ని రాష్ట్రాల పురపాలకశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి టీకాఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

  • 02 Jan 2021 09:01 AM (IST)

    తెలంగాణలో 7 కేంద్రాల్లో డ్రైరన్..

    తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్​లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్​సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు.

  • 02 Jan 2021 08:59 AM (IST)

    ఏపీలో 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్‌

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ప్రతి జిల్లాలోని మూడు ప్రదేశాల్లో డ్రై రన్‌ నిర్వహించేందుకు 39 ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వాసుపత్రి, ఒక ప్రైవేటు ఆస్పత్రితోపాటు గ్రామాల్లోని ‘కామన్‌ ప్రదేశం’లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వ్యాక్సిన్‌ లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కొవిన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Published On - Jan 02,2021 12:32 PM