వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక ఫోన్‌లో సిమ్ లేకుండానే మాట్లాడొచ్చు.!
సిమ్ కార్డు కూడా స్మార్ట్‌గా మారుతోంది. మొదట్లో పెద్దగా ఉండే సిమ్ కార్డు.. ఆ తర్వాత మైక్రో.. ఇప్పుడు నానోగా మారింది. ఇక తాజాగా ఈ-సిమ్ కార్డులు
E-Sim Card: టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సెల్‌ఫోనే సంచలనం అయితే.. ఇప్పుడు అది స్మార్ట్ ఫోన్‌గా మారి మన ప్రపంచం అయిపోయింది. అలాగే సిమ్ కార్డు కూడా స్మార్ట్‌గా మారుతోంది. మొదట్లో పెద్దగా ఉండే సిమ్ కార్డు.. ఆ తర్వాత మైక్రో.. ఇప్పుడు నానోగా మారింది. ఇక తాజాగా ఈ-సిమ్ కార్డులు వస్తున్నాయి.
వీటి ద్వారా ఫోన్‌లో సిమ్ కార్డు లేకుండానే ఇతరులతో మాట్లాడే సదుపాయం ఉంటుంది. అసలు ‘ఈ-సిమ్’ అంటే ఏంటని అనుకుంటున్నారా.? ఈ-సిమ్ ఫుల్ ఫార్మ్ ఎలక్ట్రానిక్ లేదా ఎంబెడ్‌డ్ సిమ్. దీని ద్వారా మీకు నచ్చిన టెలికాం సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ఎంచుకుని కాల్స్ చేసుకోవచ్చు. దీనిని సపోర్ట్ చేసే డివైస్‌లలో ‘ఈ-సిమ్ ప్రొఫైల్’ను డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
Also Read:
ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]
ప్రముఖ నటుడు అషీష్ రాయ్ కన్నుమూత.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..