బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!

బిగ్ బాస్ 4 చివరి అంకానికి చేరుకునేసరికి గేమ్ మంచి రసవత్తరంగా మారుతోంది. దాదాపుగా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ఈ మూడు వారాలు..

  • Ravi Kiran
  • Publish Date - 2:01 pm, Tue, 24 November 20
బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!

Bigg Boss 4: బిగ్ బాస్ 4 చివరి అంకానికి చేరుకునేసరికి గేమ్ మంచి రసవత్తరంగా మారుతోంది. దాదాపుగా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ఈ మూడు వారాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఇక 12 వారంలో మోనాల్, అవినాష్, అఖిల్, అరియానాలు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో అరియానాకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అభిజిత్ కోసం మోనాల్ నామినేట్ కావడంతో.. ఈసారి అభి, హారిక ఓట్లు అన్నీ కూడా మోనాల్‌కు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆమె హరికకు కెప్టెన్సీ టాస్క్‌లో సహాయం చేయడం.. గత మూడు వారాలుగా గేమ్ బాగా ఆడుతుండటంతో మోనాల్ సేఫ్ జోన్‌లోకి ఎంటర్ కావడం లాంఛనమే. అటు అఖిల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని అనిపిస్తోంది. అతడికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

ఇక ఎలిమినేషన్ అవినాష్, అరియానా మధ్యే జరిగేలా ఉంది. ఇద్దరికీ మైనస్‌లు ఉన్నాయి. కానీ అవినాష్‌కు జబర్దస్త్ క్రేజ్ ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే అతడు ఈ వారం సేఫ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. దీనితో కాంపిటీషన్ టఫ్‌గా ఉండటం వల్ల ఈ వారం అరియానా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో చూడాలి ఈ వీకెండ్ అరియానా ఎలిమినేట్ అవుతుందో.? లేక పరిణామాలు రివర్స్ అవుతాయో అన్నది వేచి చూడాలి.!