స్టేషన్‌లో తోపులాట.. పోలీసుల లాఠీచార్జ్

దసరా పండగకు సొంతూరికి వెళ్లాలనుకున్న సామాన్యుడికి ఎదురవుతున్న కష్టాలు అన్నీ ఇన్నికావు. ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగడంతో ప్రయాణికుల కష్టాలు మరీ పెరిగాయి. ఇదే మంచి టైమ్ అని భావించిన ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సొంతూళ్లకు వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వస్తున్న ప్రయాణికులతో స్టేషన్ మొత్తం నిండిపోయింది. దీంతో రైలు వచ్చే సమయంలో తీవ్రంగా తొక్కిసలాట జరుగుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు తోసుకోవడంతో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. అయితే చిన్నపిల్లలతో పాటు […]

  • Publish Date - 7:27 pm, Sun, 6 October 19 Edited By:
స్టేషన్‌లో  తోపులాట.. పోలీసుల లాఠీచార్జ్

దసరా పండగకు సొంతూరికి వెళ్లాలనుకున్న సామాన్యుడికి ఎదురవుతున్న కష్టాలు అన్నీ ఇన్నికావు. ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగడంతో ప్రయాణికుల కష్టాలు మరీ పెరిగాయి. ఇదే మంచి టైమ్ అని భావించిన ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సొంతూళ్లకు వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వస్తున్న ప్రయాణికులతో స్టేషన్ మొత్తం నిండిపోయింది. దీంతో రైలు వచ్చే సమయంలో తీవ్రంగా తొక్కిసలాట జరుగుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు తోసుకోవడంతో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. అయితే చిన్నపిల్లలతో పాటు సొంతూళ్లకు బయలు దేరిన వారు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. స్టేషన్‌లో విపరీతంగా రద్దీ పెరిగిపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో పరిస్థితి అదుపుతప్పి రైల్వే పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగినందున పోలీసులు ఇలా లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని చెబుతున్నారు. కేవలం సికింద్రబాద్‌లోనే కాకుండా సిటిలో ఉన్న కాచిగూడ,నాంపల్లి స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.