బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు

ఒడిషా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. శనివారం ఒడిసా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంతేకాదు ఈనెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం […]

బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 9:36 AM

ఒడిషా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. శనివారం ఒడిసా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంతేకాదు ఈనెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.