AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’కు జగన్ ‘బంపరాఫర్’.. ‘డబుల్’ ధమాకా!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సినిమా ‘సాహో’. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు అభిమానుల్లో.. ఇటు సినీ పెద్దల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎంత పాజిటివ్ బజ్ ఉన్నా.. ప్రతి సినిమాకు మొదటి వారం కలెక్షన్స్ చాలా ముఖ్యమైనవి. హిట్ గురించి పక్కన పెడితే.. తొలివారంలో ఆశించిన తగ్గట్టుగా వీలైనంత […]

'సాహో'కు జగన్ 'బంపరాఫర్'.. 'డబుల్' ధమాకా!
Ravi Kiran
|

Updated on: Aug 25, 2019 | 10:03 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సినిమా ‘సాహో’. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు అభిమానుల్లో.. ఇటు సినీ పెద్దల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎంత పాజిటివ్ బజ్ ఉన్నా.. ప్రతి సినిమాకు మొదటి వారం కలెక్షన్స్ చాలా ముఖ్యమైనవి. హిట్ గురించి పక్కన పెడితే.. తొలివారంలో ఆశించిన తగ్గట్టుగా వీలైనంత కాసులు రాలితే కోట్లలో నష్టం తప్పుతుందని నిర్మాతలు భావిస్తారు. దీంతో చిత్ర యూనిట్ దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇందులో భాగంగానే టిక్కెట్ల రేట్లను పెంచమని ఆయా ప్రభుత్వాలను కోరతారు. అలాగే ‘సాహో’ నిర్మాతలు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టికెట్ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీని బట్టి తొలివారం ‘సాహో’ను ప్రదర్శించే థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు డబుల్ అవుతుంది. అంటే.. ప్రస్తుతం ఉన్న రూ.100 టికెట్.. రూ.200 కానుంది. అయితే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలివారంలో టిక్కెట్ రేట్లను పెంచడం.. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు జరిగింది. ఇక ఈ పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభం కానుండగా.. ప్రేక్షకులకు మాత్రం భారం అవుతున్నాయి.

Follow Us
అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
చావు లేని జీవితం కోసం బిలియనీర్ సాహసం..!
చావు లేని జీవితం కోసం బిలియనీర్ సాహసం..!
ఏం కొనేటట్టు లేదు.. రైతు బాజార్‌లో నేటి కూరగాయలు, సరుకుల ధరలివే!
ఏం కొనేటట్టు లేదు.. రైతు బాజార్‌లో నేటి కూరగాయలు, సరుకుల ధరలివే!
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'