Rain Alert: తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ!
తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లా్‌లలకు ఆరేంజ్, ఎల్లో అలర్ల్‌లు జారీ చేసింది.

తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మరి కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాలు సహా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో, ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు.
ఆరేంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు ఇవే
గ్రేటర్ హైదరాబాద్ సహా మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహాబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భవనగిరి జిల్లాలో మొస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే వర్షం సమయంలో సుమారు 60 కిలీ మీటర్ల వేగంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎల్లో అలర్జ్ జారీ చేసిన ప్రాంతాలు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకల్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంభ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసీఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. అలాగే వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40 కిలో మీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మియాయపూర్, ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్ ఏరియాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల నేఫథ్యంతో ప్రజలకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. వర్షం పడే సమయంలో కరెంట్ స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, లోతట్టు రోడ్లపై నీరు నిలిచినప్పుడు ప్రయాణాలు కాస్త వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
